ధోని కోసం ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించండి.. బీసీసీఐకి జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి

Update: 2020-08-16 04:30 GMT
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అకస్మాత్తుగా ఆటకు  గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ధోని ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడం తో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొంతకాలం ఆట కొనసాగిస్తాడని  అంతా భావించారు. దానికి  తగ్గట్టే ధోని కూడా ప్రవర్తించాడు. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వచ్చాయి.

 అయితే అలా ఏమీ జరగలేదు. అప్పటినుండి మ్యాచులకు అందుబాటులో ఉండనని ధోని సెలెక్టర్ల దృష్టికి తెచ్చాడు. అయితే అది కొద్దిరోజులు లేనని భావించినా ఆ తర్వాత ధోనీ అందుబాటులోకి రాలేదు. దీంతో ధోనీ లేకుండానే బీసీసీఐ పలు మ్యాచులు నిర్వహించింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని రిటైర్మెంట్ పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

చివరి మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేదని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అయితే ఏకంగా  ధోని కోసం ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ కి విజ్ఞప్తి చేశాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ ఈ మ్యాచ్ కు వేదిక చేస్తామని వెల్లడించాడు. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నిజంగా హేమంత్ సోరెన్ ప్రతిపాదనకు బీసీసీఐ  అంగీకరించి జార్ఖండ్  లోని రాంచీలో మ్యాచ్ నిర్వహిస్తే అభిమానులకు ఇక పండగే.
Tags:    

Similar News