ఫీజు క‌డితేనే ఆన్ లైన్ క్లాస్ లింక్ !

Update: 2020-12-07 06:47 GMT
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా స్కూల్స్, కాలేజీ బంద్ అయ్యాయి. మూడు నెలలుగా పిల్లలు ఇంట్లోనే. వాస్తవంగా అయితే జూన్ 11వ తేదీ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కావాలి. వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా బంద్. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియదు. ఈ క్రమంలోనే  చాలా స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేశాయి. ఆన్ లైన్ క్లాసులతో పిల్లలకు క్లాసులు చెబుతున్నారు టీచర్స్. అయితే ఇక్కడ కూడా ఓ రూల్ పెట్టాయి కొన్ని ప్రైవేట్ స్కూల్. ఫీజు కట్టిన వారికే ఆన్ లైన్ క్లాసు అనే కండీషన్ అప్లయ్ చేశారు. టర్మ్ ఫీజు అయినా కట్టి ఉండాలని చెబుతున్నారు. ఫీజు కట్టటానికి ఆన్ లైన్ విధానం అమల్లోకి తెచ్చామని.. స్కూల్ కు రాకుండానే ఫీజు కట్టొచ్చని చెబుతున్నారు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ యాక్సిస్ ఇవ్వం అంటున్నారు ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు.

ఫీజులు క‌ట్ట‌ని విద్యార్థుల‌కు ప్రైవేటు స్కూళ్లు , కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిలిపివేస్తున్నాయి.ఫీజు చెల్లిస్తేనే క్లాసుల లింకులు పంపిస్తున్నారు. చెల్లించ‌ని వారికి పరీక్షలు రాసే అవ‌కాశం ఇవ్వ‌ట్లేదు. ఫీజుల వ‌సూలు బాధ్య‌త‌ల‌ను యాజ‌మాన్యాలు టీచ‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నాయి. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు చేల్లిస్తామ‌ని ష‌ర‌తు పెడుతున్నారు. దీంతో వాళ్లు ఫీజుల కోసం త‌ల్లిదండ్రుల‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్‌ లైన్‌ లో పాఠాలు చెప్తున్న ఓ టీచర్‌ బంగ్లా, పాక్‌ జాతీయ గీతాలు నేర్చుకోవాలని చెప్పింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్‌ లింకులను వారికి షేర్‌ చేసింది. వేరే దేశాల జాతీయ గీతాలు నేర్చుకోవడమేంటని పిల్లల తల్లిదండ్రులు తికమకపడ్డారు.

ఇదిలా ఉంటే , ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులకి హాజరైయ్యే  విద్యార్ధులు స్మార్ట్‌ ఫోన్‌ నుంచి జూమ్‌, గూగుల్‌ క్లాస్‌ రూమ్‌ వంటి మాధ్యమాల ద్వారా వర్చువల్ ‌గా తరగతులకు హాజరవుతున్నారు. పిల్లలు ఆన్‌ లైన్‌ తరగతులకు ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్ల బిల్లులు చూసి తల్లిదండ్రులు కంగుతింటున్నారు. ఆన్ లైన్ తరగతులు 2 గంటలు కంటీన్యూగా నిర్వహిస్తుండటంతో, మొబైల్ డేటా అధికంగా ఉపయోగించాల్సి వస్తుందని చెబుతున్నారు దీంతో రీచార్జ్లులు అధికంగా చేయించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు తల్లిదండ్రులకు మరో కష్టం వచ్చి పడింది. పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్లు పడిన తర్వాత ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. కొన్ని గేమ్స్ ఉచితంగా లభిస్తుండగా, మరికొన్ని పెయిడ్ గేమ్స్ ఉన్నాయి. తెలిసీ తెలీక పిల్లలు ఆప్షన్స్ వత్తడంతో బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్ డ్రా అయిపోతోంది. నాన్‌ గూగుల్‌ డేటా పేరుతో టెలికాం ఆపరేటర్లు జేబులకు చిల్లులు పెడుతున్నారు.
Tags:    

Similar News