డివిజన్ కు ఒక పార్టీనే రూ.2.5కోట్లు ఖర్చు చేస్తుందా?
గ్రేటర్ ఎన్నికల్లో నోట్ల కట్టలు తెగుతున్నాయి. అంచనా వేసిన దాని కంటే అధికంగా ఎన్నికల ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. మొదట్లో అనుకున్నంత సింఫుల్ గా ఈ ఎన్నిక జరగని పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన బీజేపీకి జోరుకు బ్రేకులు వేసేందుకు వీలుగా గులాబీ పార్టీ బాస్.. ఊహించనంత వేగంగా ఎన్నికలకు రంగం సిద్ధం చేయటం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం చూస్తే.. జనవరి మూడో వారంలో మొదలై.. ఫిబ్రవరి ఒకట్రెండు తేదీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. అందుకు భిన్నంగా రెండు నెలల ముందే ఎన్నికలు వచ్చేశాయి. వాస్తవానికి.. త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో అప్పుడప్పడే రెఢీ అవుతున్న విపక్షాలకు అధికారపక్షం అనుకోని రీతిలో షాకిచ్చింది. దుబ్బాక విజయాన్నితక్కువ చేయటం.. ఆ జోష్ ను తగ్గించేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేసినట్లుగా చెబుతారు. అయితే.. ఆయన ప్లాన్ వర్క్ వుట్ కాలేదు.
ఊహించని విధంగా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జోష్ అధికారపార్టీకే మింగుడుపడని రీతిలో మారింది. ఇంతలో ఇంతలా ఎలా ఫుంజుకుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సులువుగా గెలిచేయటం ఖాయమని భావించి గులాబీ నేతల అంచనాలకు భిన్నంగా తాజా ఎన్నికలు చుక్కలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతల దూకుడు.. గులాబీ నేతలకు ఒక పట్టాన మింగుడుపడటం లేదు. దీంతో.. లెక్కలన్ని మారిపోయినట్లుగా చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఒక్కో డివిజన్ కు కోటి రూపాయిల వరకు ఖర్చు చేయాలని భావించారు. అందుకు భిన్నంగా రూ.2.5 కోట్ల మేర ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీల్లో ఒక పార్టీ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అవసరమైతే మరో కోటికైనా సిద్ధమే కానీ.. అధిక్యత మాత్రం తమ వైపే ఉండాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. 2016లో జరిగిన ఎన్నికలకు ఏ మాత్రం పోలిక లేని రీతిలో భారీగా ఎత్తున ఖర్చు చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.