జేసీబీతో ఖననం ఎందుకు చేసారంటే ?

Update: 2020-07-07 17:30 GMT
ఏపీలో కరోనా కేసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో గడిచిన వారం రోజుల్లో విధులు నిర్వహిస్తున్న 17 మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో కరోనా మహమ్మారి కారణంగా టీటీడీ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. దీంతో ఉద్యోగి మృతదేహాన్ని తిరుపతి మున్సిపల్ శ్మశాన వాటికలో జేసీబీతో గోతులు తవ్వి , ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని కిందికి దించారు. కొద్దిసేపటి తరువాత దాన్ని జేసీబీ బకెట్‌లోకి ఎక్కించారు. అంబులెన్స్ దగ్గరి నుంచి గొయ్యి వరకు మృతదేహాన్ని జేసీబీలోనే తరలించారు. దానితోనే ఖననం చేశారు. ఖననం సమయంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో మృతదేహాన్ని జేసీబీ తో పూడ్చడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే , ఈ ఘటన పై స్పందించిన తిరుపతి మున్సిపల్ కమిషనర్ ... కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన TTD ఉద్యోగి మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఆమోదంతోనే జేసీబీ తో ఖననం చేసినట్లు తెలిపారు. మరణించిన వ్యక్తి 175 కేజీల బరువు ఉన్నాడని అందుకే మరో దారిలేక ఖననం చేయడానికి జేసీబీ వినియోగించినట్లు తెలిపారు. అయితే అది కూడా తప్పేనని ..అదనపు సిబ్బందిని పెట్టుకొని అంత్యక్రియలు చేయాల్సి ఉండేదన్నారు.
Tags:    

Similar News