400 కోట్లు జగన్ గవర్నమెంట్ లాగేస్తుందా

Update: 2021-11-30 09:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు కావొచ్చు.. లేదా.. ప‌థ‌కాలు కావొచ్చు.. ఏవైనా కూడా .. స‌ర్కారుకు ఆర్థిక క‌ష్టాలు తెస్తున్నాయి. దీంతో ఎక్క‌డెక్క‌డ నుంచి నిధులు వ‌స్తున్నా.. స‌ర్కారుకు ఎక్క‌డా స‌రిపోవ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వం అయిన కాడికి అప్పులు చేస్తోంది. అంతేకాదు.. కార్పొరేష‌న్ల‌ను కూడా తాక‌ట్టు పెడుతోంది. వాటిని కూడా అప్పులు తీసుకునేలా ప్రోత్స‌హించి.. త‌నే 180 శాతం గ్యారెంటీ ఇస్తూ.. బ్యాంకుల నుంచి నిధులు పొందుతోంది. అయిన‌ప్ప‌టికీ.. నిధులు స‌రిపోని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.

ఈ నేప‌థ్యంలో కొన్ని స్వ‌తంత్ర సంస్థ‌ల వ‌ద్ద ఉన్న నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం త‌న‌వైపు మ‌ళ్లించుకుంటోం ది. ఇప్ప‌టికే.. అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం కింద‌.. మ‌హిళ‌లు దాచుకున్న రూపాయి రూపాయి.. రూ.2000 కోట్ల‌కు చేరుకుంది. దీనిలో 1000 కోట్లు ప్ర‌భుత్వ వాటా ఉంది. మిగిలిన వెయ్యి కోట్లు మ‌హిళ‌లే కూడ‌బెట్టుకున్నారు. అయితే.. ఇటీవ‌ల ఎల్ ఐసీ వ‌ద్ద ఉన్న ఈ నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం త‌న ప‌రం చేసుకుంది. ఇక‌, ఇప్పుడు ఇవీ చాల‌వ‌న్న‌ట్టుగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఉన‌న్న రూ.400 కోట్ల‌ను కూడా ప్ర‌భుత్వం త‌న ప‌రం చేసుకుంది.

వర్సిటీ నిధులు మొత్తం రూ.400 కోట్లను స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ కు మళ్లించారు. ఈ నెల 9వ తేదీన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సిఫార్సులతో ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ నుంచి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి వ‌చ్చిన లేఖ ఆధారంగా.. వర్సిటీ ఉన్నతాధికారులు నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారు. ఈసీ మీటింగ్‌ అనుమతి తీసుకుని నిధులు మళ్లించేందుకు రంగం సిద్ధం చేశారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం టెండర్లు ఆహ్వానించినప్పుడు ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాటిలో డిపాజిట్‌ చేస్తామని ఈసీ మెంబర్లు స్పష్టం చేశారు.

గత 36 ఏళ్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో వర్సిటీ పాటిస్తున్న నిబంధనలు వేరు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో ముందుగా ఈసీ మీటింగ్‌ నిర్వహిస్తారు. టెండర్లు ఆహ్వానించేందుకు ఆమోదిస్తారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలుస్తారు. ఏ బ్యాంక్‌ ఎక్కువ వడ్డీ ఇస్తుందో అందులో నిధులు డిపాజిట్‌ చేస్తారు. ఇప్పుడు ఈ నిబంధనలు ఏమీ లేవు. ఏకపక్షంగా రూ.400 కోట్లను ఎస్ ఎఫ్ ఎస్ సీలో డిపాజిట్‌ చేయాలని ప్రొసీడింగ్స్‌ ఇచ్చేశారు. ప్రస్తుతంవర్సిటీ నిధులు కెనరా బ్యాంక్‌లో రూ.400 కోట్లు ఎఫ్‌డీ రూపంలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని కార్పొరేష‌న్‌కు మళ్లించాలని కెనరా బ్యాంక్‌కు కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. అక్క‌డి నుంచి ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేర‌తాయి.
Tags:    

Similar News