ఆన్​లైన్​ లేదు.. ఆఫ్​లైన్​ లేదు..! తెలంగాణలో చదువు సంగతి ఇదీ!

Update: 2020-12-13 05:53 GMT
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్​ బడులు ఎలాగోలా ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతో ఇంతో సిలబస్​ కూడా పూర్తిచేసుకున్నారు. కానీ ప్రభుత్వ బడుల పనితీరు మాత్రం దారుణంగా తయారైంది. ప్రభుత్వ బడులకు వెళ్లేది పల్లెటూర్లలో ఉండే పేద విద్యార్థులే. వాళ్ల దగ్గర స్మార్ట్​ఫోన్లు, గాడ్జెట్లు అందుబాటులో ఉండటం చాలా కష్టం. ఏదో టీవీలో వచ్చే ఒకటి రెండు కార్యక్రమాలే వాళ్లకు దిక్కయ్యాయి. పల్లెటూరు పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరక్ష్యారాస్యులే దీంతో వాళ్ల చదువు ఏ మాత్రం సాగడం లేదు.

పాఠశాలలు రెగ్యులర్​గా నడిస్తేనే పల్లెల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పరు. అటువంటిది ఆన్​లైన్​ కావడంతో వాళ్లు అసలే పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలు స్పందించాయి. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు తెరిస్తే తాము పాఠాలు చెబుతామని వాళ్లు అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఆన్​లైన్​ పాఠాలు చెప్పాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. కానీ అందుకు తగిన పరిస్థితి లేదు. చాలా మంది విద్యార్థులకు ఎలక్ట్రానిక్​ గాడ్జెట్స్​ లేవు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో పిల్లలు కూలి పనులకు వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ విద్యాసంవత్సరం వాళ్లు నష్టపోయినట్టే.

మరోవైపు విద్యాశాఖ వాదన మరోలా ఉంది. స్కూళ్లను ప్రారంభిస్తే 14 ఏళ్ల లోపు వారు భౌతికదూరం పాటించలేరని.. వాళ్లు మాస్కు కూడా పెట్టుకోరని అందువల్ల కరోనా ప్రబలే అవకాశం ఉందని చెబతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News