టుడే కీలకం.. కర్ణాటకలో ఎత్తుకు పైఎత్తులు!

Update: 2019-07-19 05:30 GMT
కర్ణాటక రాజకీయ సంక్షోభం నాటకీయ పరిణామాలకు దారితీస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి గురువారమే విశ్వాస పరీక్ష నిర్వహించి ఫెయిల్ అయితే తమ ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా ముందుకెళ్లాలని బీజేపీ యోచించింది. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

గురువారం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ గవర్నర్ ద్వారా చక్రం తిప్పింది. ఈ మేరకు ఓటింగ్ గురువారం పూర్తి చేయాలని శాసనసభ స్పీకర్ ను కర్ణాటక గవర్నర్ ఆదేశించారు. అయితే చర్చ మాత్రమే జరిపి ఓటింగ్ జరపలేదు స్పీకర్. ఎప్పుడు ఓటింగ్ జరపాలనేది తన విచక్షణ అధికారమని స్పీకర్... గవర్నర్ ఆదేశాలనే ధిక్కరించడం చర్చనీయాంశంగా మారింది.

గురువారం జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతే తమను ప్రభుత్వానికి ఆహ్వానించేలా బీజేపీ గవర్నర్ ద్వారా స్కెచ్ గీసింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ మాత్రం స్పీకర్ ద్వారా విశ్వాస పరీక్ష జరగకుండా మోకాలడ్డారు.

ఇక శుక్రవారం అందరి దృష్టి కర్ణాటక అసెంబ్లీపై పడింది. విశ్వాస పరీక్ష జరిపించాలని బీజేపీ నిన్న రాత్రంతా తన ఎమ్మెల్యేలను అసెంబ్లీలోనే పడుకోబెట్టింది. వాళ్లు ఉదయమే అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని నిరసన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం కల్లా విశ్వాస పరీక్ష జరిపి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ.. ఈ వ్యవహారంలో జాప్యం చేసి కూలగొట్టకుండా చూడాలని జేడీఎస్-కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈరోజే కర్ణాటకలో ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా తేలనుంది.


Tags:    

Similar News