అగ్రకులాల్లోని పేదవారికి ఓట్లు లేవా?

Update: 2020-08-13 08:30 GMT
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఇప్పటికీ దేశంలో కొనసాగుతోంది. నాడు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలు ఈ రిజర్వేషన్ల వల్ల చాలా బాగుపడ్డారు. ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత కూడా అవే రిజర్వేషన్లు. అగ్రకులమైతే అందులో పేదలు ఉన్నా వారికి రిజర్వేషన్లు దక్కడం లేదన్న ఆవేదన వారిలో ఉంది. ఇందులో మార్పురావాలని వారంతా కోరుతున్నారు.

రిజర్వేషన్ అందక.. పంట పొలాలు పొందక.. పండినా కూడా గిట్టు బాటు కాక.. ఎందరో అగ్ర కులాల్లోని పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కరువు సీమ రాయలసీమలో అగ్రకులంలోని నిజమైన పేద రైతులు.. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ప్రభుత్వ పథకాలు ఈ అగ్రకులాల పేదలకు అందకుండా పోతున్నాయి. రాయలసీమ ఆడబిడ్డలు ఎక్కడ చూసినా ఇదే చర్చ పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే మాకు ఇబ్బంది లేదని.. మేము పేద బతుకులు బతుకుతున్నామని.. మా పిల్లలకు ఉద్యోగాలు లేవని.. పంట పొలాలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

మా ప్రాంతానికే చెందినవాడైన సీఎం జగన్ కు గంపగుత్తగా ఓట్లు వేశామని.. చంద్రబాబుకు వేస్తే పంటలు పండవు.. వర్షాలు రావని.. జగన్ ను గెలిపిస్తే.. మా  రాయలసీమ పేద అగ్రకులాల వాళ్లకు పథకాలు అందకుండా పోవడం బాధాకరమని సీమ అగ్రకులాల పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీమలో అగ్రకులాల్లోని పేదలకు పథకాలు వర్తింపచేయాలని.. ఆదుకోవాలని జగన్ సర్కార్ ను కోరుతున్నారు.
Tags:    

Similar News