మద్యం తాగడంలో ఆ రాష్ట్ర మహిళలకి సాటి ఎవరులేరట !

Update: 2020-10-30 01:30 GMT
ప్రస్తుత రోజుల్లో మ‌హిళ‌లు, పురుషుల‌తో స‌మానంగా అన్ని రంగాల్లో దూసుపోతున్న సంగతి తెలిసిందే. బస్సులు , రైళ్లు , విమానాలు , రాకెట్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా మగవారికి పోటీగా నిలుస్తున్నారు. అయితే , అన్నింటిలో పోటీ పడే మహిళలు ఆ ఒక్క విషయంలో ఎందుకు వెనుక ఉండిపోవాలి అని అనుకున్నారేమో , అందులోనూ మేము పోటీ ఇస్తున్నాం అని చెప్పకనే చెప్పేశారు. ఇంతకీ ఆ విషయం ఏమిటి అని అనుకుంటున్నారా ..మద్యం తాగుడులో మగవారితో ఆడవాళ్లు కూడా పోటీపడుతున్నారు. మద్యం తాగ‌డంలో అసోం రాష్ట్ర మహిళలు అందరి కంటే ముందు వ‌రుస‌లో దూసుకుపోతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బ‌య‌ట‌ప‌డింది.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో మద్యం తాగుతున్న మహిళలు ఎక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అస్సోంలో 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 26.3 శాతం మంది మద్యం తాగుతున్నట్టు 2019-20 గణాంకాలు వెల్లడించాయి. మేఘాలయ రాష్ట్రంలో ఇది 8.7 శాతం ఉంది. 15 నుంచి 49 ఏళ్ల లోపు ఉండే మహిళలు దేశవ్యాప్తంగా మద్యం సేవిస్తున్నది 1.2 శాతం మాత్రమే.. 2015-16లో నిర్వహించిన ఎన్‌ ఎఫ్ ‌హెచ్‌ ఎస్ నివేదికలో ఈ గణాంకాలను తెలిపారు. అయితే 2018-19లో నిర్వహించిన ఎన్‌ ఎఫ్ ‌హెచ్ ఎస్ సర్వే నివేదిక విడుదల కావాల్సి ఉంది. మరోవైపు 2005-06లో నిర్వహించిన ఎన్ ‌ఎఫ్‌ హెచ్‌ ఎస్ సర్వే ప్రకారం 15-49 ఏళ్ల‌ వయసున్న అసోం మహిళల్లో మద్యం తాగేవారు 7.5%గా ఉంది.

ఇక , 2005-06 ఎన్‌ ఎఫ్ ‌హెచ్‌ ఎస్‌ 3 సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వయసున్న అసోం మహిళల్లో మద్యం తాగేవారు 7.5 శాతంగా ఉండగా, అరుణాచల్‌ ప్రదేశ్‌‌లో 33.6 శాతం, సిక్కింలో 19.1శాతం, ఛత్తీస్ ‌గఢ్‌‌లో 11.4 శాతం, ఝార్ఖండ్ ‌‌లో 9.9 శాతం, త్రిపురలో 9.6 శాతం మంది ఉన్నారు. సర్వే 3లో 7.5 శాతంగా ఉన్న మద్యం తాగే అసోం మహిళల శాతం, సర్వే 4లో మాత్రం అన్ని రాష్ట్రాలను దాటేసి 26.3 శాతానికి పెరిగింది.ఇకపోతే , దేశవ్యాప్తంగా వారానికోసారి మద్యం తాగే మహిళలు 35 శాతం మంది ఉన్నారు. అదే ఒక్క‌ అసోంలో 44.8 శాతం మంది ఉన్నారని ఆ సర్వే లో వెల్లడైంది. 15-49 ఏళ్ల‌ వయసున్న మగవారు అసోంలో 35.6 శాతం మంది మద్యాన్ని తాగుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో వీరి సంఖ్య 59 శాతంగా ఉంది. పొగా తాగ‌డంలో కూడా దేశవ్యాప్తంగా చూసిన‌ప్పుడు అసోం మహిళలు 60 శాతంగా, పురుషులు 17.7శాతంగా ఉండి, టాప్‌లో నిలిచారు.
Tags:    

Similar News