జనవరి 1 నుంచి వారికి నో ఇంటర్వ్యూస్..!
దేశంలోని నిరుద్యోగులకు ప్రధాని మోడీ న్యూఇయర్ గిఫ్ట్ ప్రకటించారు. వచ్చే ఏడాది మొదటి రోజు.. అంటే జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి సెంట్రల్ గవర్నర్ కు సంబంధించి.. బీ - సీ - డీ గ్రేడ్ ఉద్యోగాల కోసం ఎంపిక నిర్వహించే విషయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఈ నాన్ గెజిట్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కోసం కేవలం రాత పరీక్ష సరిపోతుంది. అందులో ప్రతిభ చూపించిన వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. గతంలో దీనికి భిన్నమైన విధానాన్ని అనుసరించేవారు. తొలుత.. రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలు ఉండేవి. అయితే.. అవినీతికి పాల్పడే వారు.. ఇంటర్వ్యూల పేరుతో తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే వీలుండేది. అందుకే ఈ విధానాన్ని తీసేసి.. కేవలం రాత పరీక్షతోనే ఎంపిక చేసే కొత్త విధానాన్ని 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని మోడీ నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం తీసేసుకున్నారు. నిరుద్యోగులకు ఇంతకు మించిన తీపి వార్త మరేం ఉంటుంది..?