నీతి ఆయోగ్ లో కరోనా కలకలం...కార్యాలయం మూసివేత !
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ముఖ్యంగా ఢిల్లీలో వీవీఐపీ జోన్ కూడా తాకింది కరోనా. ఏకంగా రాష్ట్రపతి భవన్ లో పనిచేసే వ్యక్తికే కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఢిల్లీలోని ఏ కార్యాలయాలను వదిలేదు లేదు అనే రీతిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సుప్రీం కోర్టుకి కూడా కరోనా సెగ తాకింది. ఈ తరుణంలోనే తాజాగా, నీతి ఆయోగ్ ను కూడా కరోనా కష్టాల్లోకి నెట్టేసింది.
నీతి ఆయోగ్ లో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా వైద్యలు నిర్ధారించారు . దీంతో, నీతి ఆయోగ్ కార్యాలయాన్ని వైరస్ రహిత ప్రాంతంగా చేసేందుకు రసాయనాలతో శుభ్రం చేసేందుకు తాత్కాలికంగా మూసివేశారు. కరోనా విలయకాలంలో కేంద్ర, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలిస్తోన్న ఆ కార్యాలయం ఇప్పుడు సడెన్ గా మూతపడింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ చర్చలు ఊపందుకున్న కీలక సమయంలో అక్కడి అధికారులు, సిబ్బంది క్వారంటైన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్షణాలు బయటపడటానికి కొద్ది గంటల ముందు వరకూ కూడా కరోనా బాధితుడు ఆఫీసు లో పని చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్, ప్లానింగ్ శాఖకు బాధ్యుడైన ప్రధాని నరేంద్ర మోదీకి విషయాన్ని చేరవేసిన ఉన్నతాధికారులు.. బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రొటోకాల్స్ ప్రకారం నీతి ఆయోగ్ భవంతిని 48 గంటలపాటు మూసేసి, క్రిమిసంహారక మందులు పిచికారి చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. వైరస్ సోకిన అధికారిని ఐసోలేషన్ కు తరలించగా, బిల్డింగ్ లో పనిచేస్తోన్న మిగతావాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు.
కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారు.