ఉష్ణమండల తుఫాన్ .. భయం గుప్పిట్లో ఆ మూడు రాష్ట్రాలు !

Update: 2020-06-01 13:00 GMT
సాధారణంగా మనం ఇప్పటివరకు ఎన్నో రకాల తుపాన్లని చూసాం. కానీ, ఈ ఉష్ణమండల తుఫాన్ అంటే మనదేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ  తరహా తుఫాన్ పొరుగు దేశాలపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నప్పటికీ..భారత్పై  దీని ప్రభావం తక్కువే. అత్యంత ప్రమాదకరమైన ఈ ఉష్ణమండల తుఫాన్ ప్రస్తుతం మనదేశానికి పొంచివుంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఉత్తర ప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం లేక పోలేదని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉష్టమండల తుపాన్ ను నిసర్గ అని పేరు పిలుస్తున్నారు.

 ఈ  నిసర్గ తుపాన్ వల్ల రాబోయే 24 గంటల్లో కర్ణాటక ఉత్తర తీర ప్రాంత జిల్లాలతో పాటు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ దక్షిణ తీర ప్రాంతం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని వెల్లడించారు. ఈ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రెడ్ అలర్ట్‌ ను జారీ చేశారు. ప్రత్యేకించి మహారాష్ట్ర, గుజరాత్ ‌లల్లో ఈ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని  హెచ్చరిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వం తక్షణమే ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సి ఉంటుందని సూచించారు.

ఇకపోతే, ఈ తరహా ఉష్ణమండల తుఫాన్ బారిన పడటం మహారాష్ట్రకు 1891 తరువాత ఇదే తొలిసారి అవుతుందని వాతావరణ శాఖ అధికారలు చెబుతున్నారు. వేసవి కాలం ముగింపు దశలో అంటే దాదాపు నైరుతి రుతు పవనాలు దేశంలో ప్రవేశించే జూన్ నెలల్లో ఇంతటి భీకరమైన తుఫాన్ 120 సంవత్సరాల కిందట ఏర్పడిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాలు ఓ ఉష్ణమండల తుఫాన్‌ను ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడం అత్యంత అరుదైన విషయమని చెప్పారు. 1948, 1980ల్లో జూన్‌లో మహారాష్ట్ర రెండుసార్లు తుఫాన్లను ఎదుర్కొన్నప్పటికీ.. అవి ఉష్ణమండల తుఫాన్లు కావని, ట్రాపికల్ సైక్లోన్‌ గా అవి రూపాంతరం చెందలేకపోయాయని యూకేకు చెందిన వాతావరణ పరిశోధన పీహెచ్‌డీ స్కాలర్ అక్షయ్ దేవ్‌రస్ తెలిపారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా.. ఆరంభంలోనే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్.. ట్రాపికల్ సైక్లోన్‌గా రూపుదిద్దుకుందని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఈ తరహా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో ఒక్కసారిగా గాలుల్లో తీవ్రత పెరుగుతుందని అన్నారు. ఈదురు గాలులు అనూహ్యంగా తమ దిశను మార్చు కుంటుంటాయని అన్నారు. మహారాష్ట్ర ఉత్తర ప్రాంతం, గుజరాత్ దక్షిణ ప్రాంతాల మధ్య నిసర్గ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ వెల్లడించింది. దీనిపై భారత వాతావరణ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కర్ణాటక ఉత్తర ప్రాంతం, గోవా మొదలుకుని మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Tags:    

Similar News