ఇకపై ఉచితంగా ఈ పాన్ కార్డు

Update: 2020-05-29 02:30 GMT
రెగ్యులర్ గా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారితో పాటు చాలామందికి పాన్ కార్డు అవసరం ఉంటుంది. అంతేకాదు, అనేక సందర్భాల్లో అనేక అప్లికేషన్లలో పాన్ కార్డు...ఓ గుర్తింపు కార్డుగా కూడా పనికి వస్తుంది. దీంతో, పాన్ కార్డు కోసం నిత్యం వేలాదిమంది దరఖాస్తు చేస్తుంటారు. కొందరు విద్యావంతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తుంటే...మరికొందరు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ...అప్లికేషన్ పూర్తి చేసిన దగ్గర నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా పాన్ కార్డు చేరడానికి దాదాపు 10-15 రోజుల సమయం పడుతోంది. అయితే, ఇకపై పాన్ కార్డు పొందాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై క్షణాల్లో ఈ పాన్ కార్డ్ ను ఇన్ స్టంట్ గా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు.

పాన్‌ కార్డు లేని వారందరికీ నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఇకపై ఇన్ స్టంట్ కాఫీ తాగినంత ఈజీగా పాన్ కార్డు పొందవచ్చని ప్రకటించారు. ఇన్ స్టంట్ గా ఈ పాన్ పొందే ప్రక్రియను నిర్మలా సీతారామన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పాన్‌ కార్డు పొందాలనుకునే వారంతా కచ్చితంగా ఆధార్‌ కార్డ్‌ కలిగి ఉండాలి. అంతేకాదు, ఆ ఆధార్‌ నంబర్...మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయ్యి ఉండాలి. అవి ఉన్న వారందరికీ ఎలాంటి పేపర్ అవసరం లేకుండానే క్షణాల్లో పాన్‌ కార్డ్ (ఈ-పాన్) పొందవచ్చు. అంతేకాదు ఈ-పాన్ కార్డ్ జారీ చేసేందుకు ఎలాంటి రుసుము ఉండదు. ఈ-పాన్ ఉచితంగా పొందవచ్చు.
Tags:    

Similar News