వలంటీర్లకు నిమ్మగడ్డ రమేశ్ వార్నింగ్

Update: 2021-03-01 04:30 GMT
ఏపీలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈమేరకు కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల్లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధుల నుంచి ఎన్నికల సంఘానికి వార్డు వాలంటీర్లపైనా ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు.

రాజకీయ కార్యకలాపాలకు వారు దూరంగా ఉండాలని నిమ్మగడ్డ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరం అవుతాయన్నారు.

రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉండాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు పాల్గొనకూడదన్నారు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావం చేయకూడదన్నారు. ఓటరు స్లిప్పులు కూడా వాలంటీర్లు అందజేయకూడదని స్పష్టం చేశారు.
Tags:    

Similar News