ఆడోళ్లే కాదు మగాళ్లు ఆమెను ఆసూయతో చూసేస్తారట!
తరచి చూస్తే ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ.. కొందరి ప్రత్యేకతలు ఫోకస్ అయినట్లుగా అందరికి కావు. గుజరాత్ కు చెందిన పదిహేడేళ్ల నీలాన్షి పటేల్ సంగతే చూడండి. ఆమెకున్న ప్రత్యేకతను చూసి అవాక్కు కావటమే కాదు.. అసూయ పడటం ఖాయం. ఎందుకంటే.. ఇవాల్టి రోజున పొడుగాటి జుట్టు ఉన్నోళ్లు కనిపించటంచాలా తగ్గిపోయింది. పాతికేళ్ల క్రితం పొడగాటి జుట్టు చాలామందిలో ఉండేది. కానీ.. మారిన కాలం.. వాతావరణంతో పాటు.. ఫ్యాషన్లు.. జీవనశైలి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అంశాలు పొడుగాటి జుట్టును పొట్టిగా చేసి.. పోనీకి పరిమితం చేశాయి.
దీంతో ఆడోళ్లకు అందమైన పొడుగు జుట్టు ఇప్పుడు అరుదైనదిగా మారింది. పిరుదుల వరకు జడ ఉన్న అమ్మాయిలు అరుదుగా కనిపించే పరిస్థితి. అలాంటిది ఏకంగా పాదాలను టచ్ చేసేంత జట్టు ఉండటానికి మించిన లక్ ఇంకేం ఉంటుంది చెప్పండి. తాజాగా ఈ ప్రత్యేకతతోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో తన పేరు నమోదు చేసుకుంది గుజరాత్ కు చెందిన టీనేజర్ నీలాన్షి.
2018లో 170.5 సెంటీమీటర్ల పొడవాటి జుట్టుతో ఉన్న రికార్డును తిరగరాసిన గుజరాత్ టీనేజర్ జట్టు ఏకంగా 190 సెంటీమీటర్లు ఉండటం విశేషం. తానెక్కడకు వెళ్లినా సెల్ఫీలు తీసుకునేందుకు విపరీతమైన ఆసక్తిని చూపుతారని.. జుట్టుతో తనకు సెలబ్రిటీ గుర్తింపు వచ్చినట్లు చెబుతారు. అంతేనా.. ఈ టీనేజర్ బయట కనిపించిన వారంతా ఒకటికి రెండుసార్లు చూడటమే కాదు.. తమకు లేని కేశ సింగారన్ని చూసుకొని అసూయ పడతారట. మరి.. మగాళ్లకు అసూయ ఎందుకంటారా? తామెంతో ఇష్టపడే ఇంట్లో వారికి లేనంత జుట్టు.. బయట అమ్మాయికి ఉండటాన్ని జీర్ణించుకుంటారా చెప్పండి?
Full View