• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీబీసీ చానెల్ లో...

బీబీసీ చానెల్ లో భార్యాభర్తల పంచాయితీ!

By - Tupaki Desk
Update: 2016-10-15 22:30 GMT
ఈమధ్య కాలంలో ఒక యాంకర్ కం జడ్జి - ఒక లాయర్ - ఒక సైక్రియాటిస్ట్ ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు వర్గాలు... ఈ యాంగిల్ లో తెలుగు టీవీ చానల్స్ లో భార్యాభర్తల పంచాయితీల ప్రసారాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇది కేవలం తెలుగు టీవీ ప్రేక్షకులకు మాత్రమే అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ప్రఖ్యాత బీబీసీ చానెల్ లోనూ అలాంటి ఓ భార్యాభర్తల పంచాయితీ తాజాగా ప్రసారం అయింది. అయితే మన తెలుగు చానాల్స్ లో తిట్టుకున్న రేంజ్ లో రచ్చ జరగకపోయినా ఈ పంచాయితీ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇంతకూ అది ఎవరి గురించి అంటారా? ఆఫ్రికాలోనే పెద్ద దేశం నైజీరియాకు అధ్యక్షుడు - ఆమె భార్యకు సంబందించినది!

తాజాగా బీబీసీ లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మదు బుహారీ - తన భార్య అయిషా బుహారీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో "నా భర్తకు స్వయంగా ఆయనే నియమించిన ఉన్నతాధికారులు కూడా గుర్తుండరు.. అన్ని విషయాలు నేనే దగ్గరుండి చూసుకోవాలి. చాలా ఏళ్లుగా ఆ పని చేస్తున్నాను.. అందుకే ఈసారి 2019లో జరగబోయే ఎన్నికల్లో నేనే పోటీకి దిగొద్దని ఆయనకు అల్టిమేటం ఇచ్చాను" అని మాట్లాడారు అయిషా బుహారి. అంతేనా... ఈ మాట కాదని ఎన్నికల్లో పోటీ చేస్తే గనుక... ఆయనకు వ్యతిరేకంగా ఈమె ప్రచారం కూడా చేపడుతుందని ప్రకటించింది... అదే గనక జరిగితే ఆయన కచ్చితంగా ఓడిపోతారు అని తేల్చేసింది.

ఈ సంచలనం వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మదు... "నా భార్య ఏ పార్టీకి చెందిందో చెప్పలేను కానీ, ఆమె మాత్రం నా వంటగదికి - మరికొన్ని కీలకమైన గదులకు చెందిందని అని  మాత్రం చెప్పగలను" అని తేల్చేశారు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసి - దేశపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోన్న ఆమెను పట్టుకుని ఈమె వంట గదికి చెందింది మాత్రమే అని అధక్షుడు వ్యాఖ్యానించడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరో విషయం ఏమిటంఏ... ఈ వ్యాఖ్యలపై మొహమ్మదు బుహారీ స్పందిస్తున్న సమయంలో నైజీరియాకు అతిథిగా వచ్చిన జర్మన్ చాన్సరల్ ఏంజిలా మోర్కెల్ పక్కనే ఉన్నారు. పాపం ఆ సమయంలో ఆమె మాత్రం ఏమిచేస్తారు చెప్పండి... అతిథిమర్యాద పాటిస్తూ చిన్నగా నవ్వి ఊరుకున్నారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nigeria President 
  • Muhammadu Buhari 
  • Wife 
  • Telugu NEws 

Similar News

మొన్న ఎన్నిక‌లు.. నేడు వృద్ధి.. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలంటున్న ట్రంప్‌

2026-11-21 17:41 GMT

3 గంట‌ల 22 నిమిషాలు.. రికార్డు బ్రేక్ చేసిన చంద్ర‌బాబు

2026-11-21 17:39 GMT

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

2026-11-21 17:04 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS