పుల్వామా దాడి వ్యక్తి అరెస్ట్: డోర్ డెలివరీ చేసుకుని మరీ ఉగ్రదాడులు

Update: 2020-02-29 08:15 GMT
టెక్నాలజీ దారి తప్పుతోంది. టెక్నాలజీతో మానవుడి జీవితంతో ఎంతో ముడిపడి ఉంది. అయితే ఈ టెక్నాలజీ సంఘ విద్రోహ శక్తులకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వారు టెక్నాలజీని ఉపయోగిస్తూ దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దీంతో ప్రజల ఆస్తులు, భద్రతకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. అయితే దీన్ని ఉగ్రవాదులు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఏకంగా పేలుళ్ల కోసం ముడి సరుకును ఆన్‌లైన్‌ ద్వారా డెలివరీ చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. గతేడాది జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో టెక్నాలజీని వినియోగించుకుని డెలవరీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఉగ్రవాది షకీర్ బషీర్ ని శుక్రవారం ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అతడు పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ గ్రూపుకు చెందిన వ్యక్తిగా గుర్తించాడు. అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రదాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలను ఓ ఆన్‌లైన్ డెలివరీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపినట్లు సమాచారం. పేలుడుకు ఉపయోగించిన బ్యాటరీ, అమోనియం, నైట్రేట్ పదార్థాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి కొనుగోలు చేసినట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.

పుల్వామా దాడిలో అతడు ఉపయోగించిన మారుతీ వాహనాన్ని అతడే ఏర్పాటుచేసుకుని పేలుడు పదార్థాలతో నింపినట్లు వెల్లడించాడని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. సీఆర్‌పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌కు 500 మీటర్ల దూరంలో వాహనం నుంచి దిగిపోయి అనంతరం ఆదిల్ అహ్మద్ కారును డ్రైవ్ చేశాడని వివరించారు. అయితే ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్‌, పాక్‌ ఉగ్రవాది ఉమర్ ఫరూక్‌కు అతడు ఆశ్రయం కూడా కల్పించినట్లు విచారణలో తేలింది.

పక్కా ప్లాన్ తో పుల్వామా దాడి
పుల్వామా లో దాడికి పక్కా ప్రణాళికతో చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. షకీర్ బషీర్ మాగ్రే లెత్పోరా బ్రిడ్జి సమీపంలో ఫర్నీచర్‌ దుకాణం ఉండడంతో సీఆర్ పీఎఫ్ బలగాల కార్యాచరణను రోజు గమనించేవాడు. పాక్ ఉగ్రవాది మహమ్మద్ ఉమర్ సలహాతో శ్రీనగర్‌ హైవేపై వెళ్లే సీఆర్పీఎఫ్‌ కదలికలను నోట్ చేసుకుని కాన్వాయ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మహమ్మద్ ఉమర్, ఆదిల్ అహ్మద్‌లకు సమాచారం చేరవేసేవాడు. ఇతడికి మరో ఇద్దరు సహకరించేవారు. మొత్తం ఐదుగురు కలిసి పుల్వామా దాడి చేసినట్లు ప్రాథమికంగా తేలింది. అయితే వీరిలో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌ కాగా తాజాగా మోగ్రే పట్టుబడ్డాడు. అతడిని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశ పెట్టగా 15 రోజుల రిమాండ్ విధించారు.
Tags:    

Similar News