తెలంగాణ పోలీసులకు షాకిచ్చిన మానవ హక్కుల సంఘం

Update: 2019-12-06 12:47 GMT
దిశ హంతకులను  హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయనుంది. ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ ను పంపించనుంది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్  తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజాగా నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. దీనిపై సుమోటోగా తీసుకుంది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.  మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు స్వీకరించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్  నిజనిర్ధారణ కమిటీ చటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలిస్తుంది..  ఎన్ కౌంటర్ చేయడానికి హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన కారణాలు, మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన దర్యాప్తును కొనసాగించనుంది.

అనంతరం ఈ ఎన్ కౌంటర్ నకిలీదా.? లేదా నిజమైనదా అని మానవ హక్కుల కమిషన్ నిర్ధారించనుంది.దీనిపై చర్యలు తీసుకోనుంది.
    

Tags:    

Similar News