కేపీకి ఎస‌రు పెడుతోంది ఎవ‌రు..?

Update: 2022-11-23 23:30 GMT
కేపీ.. వైసీపీలో ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. మైల‌వ‌రం నుంచి తొలిసారి ఎన్నికై.. అసెంబ్లీలో అడుగు పెట్టిన నాయ‌కుడిగా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ రికార్డు సృష్టించారు. పైగా.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ప‌ట్టు పెంచుకున్నార‌ని.. కొన్నాళ్ల కింద‌ట పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా సాగింది. అయితే, ఇప్పుడు ఆయ‌న పేరు మ‌రోసారి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దీనికి కార‌ణం.. వ‌సంత కృష్ణ ప్రసాద్ ఉర‌ఫ్ కేపీ.. తండ్రి మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు.. వైసీపీకి  వ్య‌తిరేకంగా.. తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే. అటు రాజ‌ధాని అమ‌రావ‌తి, ఇటు ఎన్టీఆర్ విశ్వ‌విద్యాల‌యం అంశాల‌ను ప్రస్తావించిన నాగేశ్వ‌ర‌రావు.. వైసీపీని తీవ్ర స్థాయిలో ఏకేశారు. ఎన్టీఆర్ పేరు మార్చ‌డం దుర్మార్గ‌మన్న ఆయ‌న‌.. ఇంత జ‌రిగినా..క‌మ్మ వ‌ర్గం చెవులు, క‌ళ్లు, నోరు మూసుకుంద‌ని రెచ్చ‌గొట్టారు.

ఇక‌, అమ‌రావ‌తిని మించిన రాజ‌ధానిని వ‌దులుకుంటే.. చ‌రిత్రలో భ్ర‌ష్టులుగా నిలుస్తారని అన్నారు. ఈ రెండు కూడా.. వైసీపీకి మంట‌పుట్టించాయి. దీంతో పార్టీ అధిష్టాన‌మే.. కేపీకి క్లాస్ తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో హుటాహుటిన జ‌ర‌గ‌బోయే ప్ర‌మాదాన్ని ముందుగానే గుర్తించిన కేపీ.. త‌న‌కు తండ్రికి సంబంధం లేద‌ని, ఆయ‌న‌కు ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌ద‌ని పేర్కొని.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా మాట్టాడారు. అయితే, అస‌లు ఇంత‌లా వసంత నాగేశ్వ‌ర‌రావు రెచ్చిపోవ‌డానికి.. తెర‌వెనుక ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిగా మారింది.

దీనికి కార‌ణం.. కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి ఉన్నార‌ని, ఆయ‌న కావాల‌నే ఇలా చేస్తున్నా ర‌ని.. కేపీ వ‌ర్గంఆరోపిస్తోంది. స‌ద‌రు మంత్రికావాల‌నే క‌క్ష తీర్చుకుంటున్నార‌ని.. ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మైల‌వ‌రం నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నారా? అనే సందేహం వ్య‌క్తం చేశారు. మొత్తంగా చూస్తే.. మంత్రి పెట్టిన మంటే ఇదంతా అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News