మైల‌వ‌రంలో పొలిటిక‌ల్ నిశ్శ‌బ్దం.. రీజనేంటి...?

Update: 2022-11-22 15:35 GMT
ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలో రాజ‌కీయం సైలెంట్ అయిపోయింది. అధికార పార్టీ వైసీపీలో ఒక చిత్ర‌మైన వివాదం తెర‌మీదికి రాగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మ‌రో విష యం వివాదానికి దారితీసింది. దీంతో ఇక్క‌డ రెండు పార్టీల నాయ‌కులు మౌనంగా ఉన్నారు. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మ సామాజిక వర్గం అండ‌తో ఇక్క‌డ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత‌.. ఇదే వ‌ర్గాన్ని ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అప్ప‌టి నుంచి కేపీపై క‌మ్మ వ‌ర్గం గుర్రుగా ఉంది. ఇక‌, ఇటీవ‌ల ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్పు విష‌యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అయినా.. ఇక్క‌డ ఎలాంటి వివాదాలు జ‌ర‌గ‌రాదంటూ.. ఎక్క‌డిక‌క్క‌డ కేపీ.. రాజ‌కీయంగా స‌రిపుచ్చారు. దీంతో కమ్మ వ‌ర్గం సైలెంట్ అయింది. అయితే, ఇప్పుడు ఆయ‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావు స్వ‌యంగా క‌మ్మ‌ల‌ను రెచ్చ‌గొట్టారు.

దీంతో అస‌లు మీరు ఎందుకు మాట్లాడ‌లేద‌ని, క‌మ్మ సామాజిక వ‌ర్గం అంటే మీరు కూడా అందులోకే వ‌స్తా ర‌ని, ఎమ్మెల్యేగా ఉండి క‌నీసం దీనిపై ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేద‌ని.. క‌మ్మ వ‌ర్గానికి చెందిన వ్యాపారస్తులు నిల‌దీస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌లు సైలెంట్ అయ్యారు. ఇక‌, ఇదే విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ప్ర‌య‌త్నస్తున్నారు.

కానీ, ఆయ‌న‌తో క‌లిసి న‌డిచేందుకు.. క‌మ్మ వ‌ర్గం దూరంగా ఉంది. అంటే.. అధికార పార్టీపై కోపం ఉన్నా.. ప్ర‌తిప‌క్షంతో క‌లిసి న‌డిచిదిలేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యాన్ని పెద్ద‌ది చేస్తే ప్ర‌యోజ‌నం లేద‌నుకున్న దేవినేని కూడా సైలెంట్‌గానేఉంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News