ట్రంప్ కు ట్విట్టర్ షాక్.. హోరెత్తిన గో బ్యాక్

Update: 2020-02-24 07:45 GMT
భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ఎన్నో ఆశలతో భారత్ కు వచ్చిన ట్రంప్ కు అహ్మదాబాద్ లో ఘన స్వాగతం లభించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ట్విటర్ లో ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ ట్వీట్లు భారీగా వచ్చాయి. గో బ్యాక్ ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ తో అత్యధికంగా ట్వీట్లు నమోదయ్యాయి. నంబర్ వన్ స్థానంలో #GoBackTrump అనేది ట్రెండింగ్ అవుతోంది.

భారత పర్యటనను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో మానవ హక్కులు కాలరాస్తున్నాడని, అణుయుద్ధానికి తెరలేపుతున్న వ్యక్తి ట్రంప్ అని పేర్కొంటున్నారు. నమస్తే ఇండియా వేరు.. నమస్తే ట్రంప్ వేరు అని చెబుతున్నారు. అయితే ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన నానా హడావుడిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ సందర్భం గా ఒకరు చేసిన ట్వీట్ విశేషంగా ఆకట్టుకుంది.

ట్రంప్ పర్యటన సందర్భంగా చిన్నారులమైన మేం ఐదు గంటలుగా నిరీక్షిస్తున్నామని ఆవేదన చెబుతూ ఓ బాలిక ఫొటో ఉన్న ట్వీట్ ఆవేదనకు గురి చేసింది. ఈ విధంగా ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ లో ప్రజా జీవనం స్తంభించింది. అప్రకటిత సెలవు కొనసాగింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకే గో బ్యాక్ ట్రంప్ ట్వీట్ వైరలవుతోంది.
Tags:    

Similar News