మందు కావాలంటే మనీతో పాటు ఆ రెండు కావాల్సిందే ?
దేశంలో కరోనా విజృంభిస్తుంది. కేంద్రం కరోనా కట్టడి లోకి రాకపోవడంతో మరోసారి మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే , కొన్ని సడలింపులు ఇవ్వడంతో మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేసారు. లిక్కర్ షాప్‌లు తెరచుకోవడంలో మద్యం బాబుల సంబరం అంతా ఇంతా కాదు. షాపుల తెరవక ముందే ఉదయం నుంచి క్యూ కడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు.
కాగా.. ఈ క్రమంలో ఏపీ అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడుగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. అందరూ గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలో గొడుగు నిబంధన పెట్టారు. అక్కడ అది వర్కవుట్ అయ్యి.. అందరూ సామాజిక దూరం పాటించారు. ఈ నేపథ్యంలో అంతటా గొడుగును తప్పనిసరి చేశారు. నిబంధనలను పాటించకపోవడంతో ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. సోమవారం 25 శాతం పెంచిన ఎక్సైజ్ శాఖ.. మంగళవారం దానిపై అదనంగా మరో 50శాతం పెంచారు.
దీనిపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎదరుదాడి చేస్తున్నారు. అటు మద్యం షాపు నిర్వాహకులు, కొనుగోలు దారులకు ఏపీ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటు మద్యం దుకాణల వద్ద గుంపులు గుంపులుగా గుమికుడరాదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఈ నిభందనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించింది.
ఇకపోతే , తెలంగాణలో లాక్ డౌన్ ను మే 29 వరకు పొడగిస్తునట్టు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే , కేంద్రం ఇచ్చిన సడలింపు ఆరెంజ్ . గ్రీన్ జోన్లో కొనసాగుతాయని తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దీనితో తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి ముందుజారతా మొదలైంది. అందరూ ఊహించినట్టే ..మందుబాబులు మద్యం దుకాణాల ముందు తెల్లవారు జామునుండే బారులు తీరారు.