జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కి కొత్త పాలకమండలి

Update: 2021-09-04 06:30 GMT
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక మండలి కోసం నిర్వహించిన ఎన్నికల్లో నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఈ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడుగా సి. వెంటేశ్వరరావు (సీవీ రావు) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.హిమబిందు ఎన్నికయ్యారు. సెక్రటరీగా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ గా జనార్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు.

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలకమండలి సభ్యులుగా.. అమీతారెడ్డి, తిరుపతి రావు, కిలారు రాజేశ్వరరావు, రమేష్ చౌదరీ, శివప్రసాద్ , శ్రీనివాస రెడ్డి, అశోక్ రావు, రవీంద్రనాథ్, సుభాష్, జగ్గారావు, వెంకట సుబ్బరాజు ఎన్నికయ్యారు.

హైదరాబాదులో ప్రిస్టీజియస్ సొసైటీల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. పలువురు ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండటమే దీనికి కారణం. తాజాగా ఎన్నికయిన ఈ ప్యానెల్ రెండేళ్ల పాటు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నూతన కార్యవర్గం తొలిసారి సెప్టెంబరు 19న భేటీ కానుంది. ఈ సొసైటీలో మొత్తం 3,181 సినీ ప్రముఖులకు ఓట్లు ఉండటం గమనార్హం.

నరేంద్ర చౌదరి గతంలో జుబ్లీ హిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ ఆయన గెలవలేదు. తాజాగా జరిగిన ఈ పాలకడండలిలో ఆయన ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది.


Tags:    

Similar News