టెస్లాకు పోటీ ఇస్తున్న కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 600 కి.మీ

Update: 2021-09-09 11:11 GMT
ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విప‌రీతంగా పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరుగుత‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇలా వీటి ధ‌ర‌లు పెర‌గ‌డంతో వాహనదారులు చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక ఈ త‌రుణంలో వివిధ కార్ల తయారీ కంపెనీలు కూడా ఇలాంటి ఈవీ కార్ల‌ను అలాగే బైకుల‌ను తయారు చేసేందుకు రెడీ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు చాలా వ‌ర‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి.

ఇలాంటి త‌రుణంలో ఇక ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి బ్రాండ్ ఉన్న‌టువంటి టెస్లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా బాగానే ఇమేజ్ ఉంది. ఇప్ట‌పికే ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల‌ను అత్య‌ధికంగా మార్కెట్‌లోకి తీసుకు వ‌స్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. ఇక వాహన రంగంలో టెస్లా కంపెనీకి కూడా పోటీగా చాలా ర‌కాల ఆటోమొబైల్‌ కంపెనీలు వ‌స్తున్నాయి.

ఇంటర్నేషనల్‌ ఆటో మొబిలీటీ షోలో ఇలాంటి కార్ల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇక ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్‌ బెంజ్‌ కంపెనీ కూడా ఇందులో చేరిపోయింది. ఇక ఈ కంపెనీ కూడా త‌న సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. మెర్సిడిజ్‌ ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షో ద్వారా బ‌జాజ్ కంపెనీ ప‌రిచ‌యం చేసింది. అయితే ఈ కారు ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం అయిన టెస్లా కార్ల‌కు ధీటుగా నిలుస్తుంద‌ని కంపెనీ కూడా ఒక ప్రకటనలో చెప్పింది.

ఈ కార్ల‌ను కూడా ప్రపంచవ్యాప్తంగా 2022లోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపింది ఈ మెర్సిడిజ్ కంపెనీ. కాగా ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారుకు చాలా ర‌కాల స్పెషాలిటీలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అదేంటంటే ఈ కారును ఒక్క సారి చార్జింగ్ తో సుమారు 660 కిలోమీట‌ర్లు ప్రయాణం చేస్తుంద‌ని చెబుతున్నారు. అంతే కాదు ఈ చార్జింగ్ కారులో 90కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ అమ‌ర్చిన‌ట్టు కంపెనీ వివ‌రించింది.

కారులో డీసీ చార్జింగ్‌ కెపాసిటీని పెంచేందుకు ఇలా 170kW బ్యాటరీని ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపింది. వీటితో పాటే 430 లీటర్ల బూట్‌ స్పేస్‌ను కూడా కారులో అందబాటులో ఉంచినట్టు వివ‌రించింది మెర్సిడెజ్ కంపెనీ. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే మార్కెట్‌లోకి ఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొస్తున్న‌ట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కారు రూట్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా పోటా పోటీగా వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇలాంటి కార్లను తీసుకొచ్చి సంచ‌ల‌నం రేపేందుక బాగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అన్నీ కుదిరితో మ‌రి కొన్ని రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి కార్ల కంపెనీలు. అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లు గ‌న‌క పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం రానున్న రోజుల్లో పూర్తిగా పెట్రోల్‌, డీజిల్‌ బాధలు తప్పుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఇలాంటి కార్లు ఇంకా రావాల‌ని అంతా కోరుతున్నారు. ఇక కార్ల దారిలోనే బైక్‌ల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నాయి.


Tags:    

Similar News