రియల్ ఎస్టేట్ వ్యాపారితో రేవంత్ కు కొత్త కష్టం
తెలంగాణ అధికారపక్షంపై తరచూ విరుచుకుపడే కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి సుపరిచితం. తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ మీద విమర్శలు.. ఆరోపణలు ఎక్కుపెట్టే ఆయనకు.. తాజాగా కొత్త కష్టం ఎదురైందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. కీసర ఎమ్మార్వో నాగరాజు ఉదంతంలో ఎంపీ రేవంత్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. నాగరాజుకు రూ.కోటికి పైగా లంచం ఇస్తూ దొరికిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరైన అంజిరెడ్డికి ఎంపీ రేవంత్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఏసీబీ అధికారుల ప్రాధమిక విచారణలో ఈ కొత్త విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. దీనికి బలం చేకూరేలా రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్ బ్రోకర్ గా వ్యవహరించే అంజి రెడ్డి కారులో రేవంత్ రెడ్డికి చెందిన ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. అంజిరెడ్డికి.. రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైనట్లేనన్న మాట వినిపిస్తోంది. ఎమ్మార్వో నాగరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నివాసం కూడా అంజిరెడ్డి గెస్టు హౌస్ గా చెబుతున్నారు.
ఇలా బయటకు వస్తున్న వివరాలు ఎంపీ రేవంత్ కు కొత్త కష్టాన్ని తీసుకురానున్నాయా? అన్నది క్వశ్చన్ గా మారింది. దీనికి తోడు.. ఒక ఎంపీకి చెందిన ఫైళ్లు.. ఒక స్థిరాస్తి వ్యాపారి వద్ద ఎందుకు ఉన్నాయి? రేవంత్ కు.. అంజిరెడ్డికి మధ్యనున్న సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. కలెక్టరేట్ లో ఉండాల్సిన పలు పత్రాలు కూడా అంజిరెడ్డి దగ్గర గుర్తించినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. ఎంపీ రేవంత్ కు కొత్త చిక్కులు తప్పవంటున్నారు.