కొత్త పెళ్లి కూతురు హత్య.. కారణం తెలిస్తే నోట మాట రాదంతే
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పే వ్యక్తే.. ప్రాణాలు తీస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా వెలుగు చూసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రెండు అక్షరాల ‘ప్రేమ’ ఇటీవల కాలంలో అదే పనిగా ప్రాణాల్ని తీస్తోంది. ఇదంతా చూస్తే.. ప్రేమ పేరుతో ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నామా? అన్న భావన కలుగక మానదు. ఎవరినైనా ఇష్టపడినప్పుడు.. వారిని ప్రాణంగా ప్రేమిస్తున్నప్పుడు.. వారి సంతోషం కోసం.. వారు బాగుండాలనుకోవటం సహజం. అందుకు భిన్నంగా ప్రేమించే వ్యక్తి దూరమైనా.. దూరం అవుతున్నా.. వేరే వారి సొంతమైతే చాలు.. దారుణంగా చంపేయాలనుకోవటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. జీడిమెట్లకు చెందిన 21 పూజ తాజాగా దారుణ హత్యకు గురైంది. జార్ఖండ్ కు చెందిన ఆమె.. రాజేశ్ వర్మను ఈ ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చి.. ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇంటి పట్టున ఉండే ఆమె.. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత ప్రియుడికి ఫోన్ చేయటం అలవాటైంది.
ఈ మధ్యన సరదాగా ప్రియుడ్నిచూసేందుకు హైదరాబాద్ వస్తావా? అని అడిగినంతనే.. సదరు ప్రియుడు ఓకే చెప్పేశాడు. అడిగిన 24 గంటల్లోనే ఒక స్నేహితుడ్ని వెంట పెట్టుకొని సిటీకి వచ్చి ఆమెను కలిశాడు. ఉదయం ఫోన్లో చూడాలని అడిగితే సాయంత్రానికి హైదరాబాద్ కు వచ్చేసిన ప్రియుడ్ని కలిసింది పూజ.
ఈ సందర్భంగా ఆమెను తనతో వచ్చయాలని.. తామిద్దరం పెళ్లి చేసుకొని ఉందామని కోరాడు. అందుకు పూజ అంగీకరించలేదు. అతనితో వచ్చేయటం కుదరదని.. అప్పుడప్పుడు రహస్యంగా కలుద్దామని చెప్పింది. అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు ఆమెను బలవంతం పెట్టాడు. రాలేనని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు.. ఆమెను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన రాజేశ్.. భార్య ప్రాణాలు వదిలి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.