మతి లేని పీకే.. అతడి తీరుపై సర్వత్రా ఆగ్రహం

Update: 2020-03-27 10:10 GMT
ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ దేశానికి కరోనా వైరస్‌ పాకింది. ఆ మహమ్మారితో ప్రస్తుతం భారతదేశం తీవ్రంగా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆ లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోంది. అయితే దీనిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్లానింగ్‌ లేకపోవడంతోనే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకురాలు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మమతా బెనర్జీ వంటి బద్ధ శత్రువులే అంగీకరించి స్వాగతించిన వేళ ప్రశాంత్‌ కిశోర్‌ తప్పుబట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనాను ముందుగా గుర్తించడంతో విఫలమైందని పేర్కొన్న ప్రశాంత్‌ కిశోర్‌పై వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. బద్ధ శత్రువులే ఏకమైన సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 21 రోజులు లాక్‌డౌన్‌ విధించడం అధికమని పేర్కొనడంతో అతడికేం తెలుసు కరోనా వైరస్‌ గురించి అని ప్రశ్నిస్తున్నారు. ముందస్తుగా ఊహించకపోవడంతోనే భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని, ప్రస్తుతం సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌ లో తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటామని ప్రశాంత్‌ కిశోర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రశాంత్‌ కిశోర్‌ ట్విటర్‌లో చేసిన విమర్శలను నెటిజన్లు తిప్పికొడుతున్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం పీకేకు అలవాటైపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్న వ్యక్తి మానవత్వం మరచి కరోనాను కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. సోనియగాంధీ, మమతా బెనర్జీలే మద్దతు పలుకుతుండగా పీకేకు ఏమైందని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఆయన కూడా కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా నెటిజన్లు అతడిని కోరుతున్నారు.
Tags:    

Similar News