‘కోహ్లీ నువ్వో కుక్కవు’ నెటిజన్​ మండిపాటు.. మధ్యలో వచ్చిన కాంగ్రెస్​ నేత!

Update: 2020-11-16 03:00 GMT
పర్యావరణ హితం కోసం టపాసులు పేల్చకండి’ అని ఇటీవల టీం ఇండియా కెప్టెన్​ విరాట్ ​కోహ్లీ తన అభిమానులకు సూచించాడు. ఈ విషయంపై తీవ్ర దుమారం రేగింది. ‘నువ్వు నీ పుట్టినరోజునాడు టపాసులు పేల్చుతావు మమ్మల్ని మాత్రం వద్దంటావా’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోహ్లీ ట్వీట్ కు వేల సంఖ్య లో నెగిటివ్​ కామెంట్లు  వచ్చాయి. అయితే ఈ విషయంలో కొందరు నెటిజన్లు మరీ రెచ్చిపోయారు. ఈ ఫ్యాన్​ అయితే ఏకంగా కోహ్లీని కుక్కతో పోల్చాడు.

‘ కోహ్లీ నువ్వో కుక్కవు. అనుష్క పెంచుకుంటున్న కుక్కవు అందుకే టపాసులు పేల్చొద్దంటున్నావు’ అంటూ ఓ నెటిజన్​ కామెంట్​ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్విటర్ వేదికగా కోహ్లీకి మద్దతు తెలిపారు. ‘అవును కోహ్లీ కుక్కే. అనుష్క పెంపుడు కుక్క.  కుక్కకంటే విశ్వాసమైన జంతువు ఏముంటుంది..? అందుకే అనుష్కకు తన కుక్కను కట్టి ఉంచాల్సిన అవసరం లేదు. టపాసులు పేల్చి కాలుష్యం పెంచవద్దని, కాలుష్యం వల్ల మానవ మనుగడే దెబ్బతింటుందని కోహ్లీ మీకు చెప్పాడు. కానీ మీలాంటి వెధవలు, మూర్ఖులకు అర్థం కాలేదు. మీ డీఎన్‌ఏని ఒకసారి చెక్ చేయించుకోండి. మీరు ఇక్కడి మూలవాసులా.. కాదా తెలుస్తుంది’ అంటూ ఉదిత్ రాజ్ ట్విటర్‌ లో నిప్పులు చెరిగారు.

మరోవైపు కేంద్రప్రభుత్వంపై కూడా ఉదిత్​ రాజా నిప్పులు చెరిగాడు. ఓ క్రికెటర్​ ప్రజలకు మంచివిషయాన్ని చెబితే వారు దాన్ని అర్థం చేసుకోకుండా ఎదురుదాడికి దిగితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి విషయాలను కేంద్రప్రభుత్వం సీరియస్​ గా తీసుకోవాలని.. ఇండియన్​ క్రికెట్​టీం కెప్టెన్ ​పై ఓ వ్యక్తి తప్పుడు రాతలు రాస్తే చర్యలు తీసుకోలేరా అంటూ ప్రశ్నించాడు. సోషల్ మీడియా లో కొందరి తీరు వల్ల ఇటీవల ప్రతి అంశం వివాదాస్పదమవుతోంది. వీఐపీ లు విమర్శల పాలవుతున్నారు.
    

Tags:    

Similar News