మెగాస్టార్ చేసిన తప్పు అదేనట... ?

Update: 2022-01-16 11:33 GMT
మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పేంటి. అసలు ఆయన ఎందుకు తప్పు చేస్తారు. ఆయనకు ఆ అవసరం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఫ్యాన్స్ తో పాటు ఆయన్ని అభిమానించే కోట్లాదిమందిలో కలుగుతాయి. కానీ చిరంజీవి చేసింది ముమ్మాటికీ తప్పే అంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆయన పండుగ రోజు కూడా మెగాస్టార్ ని అసలు వదలడంలేదు.

చిరంజీవి ఆఘమేఘాల మీద ప్రత్యేక విమానంలో జగన్ ఇంటికి ఎందుకు వెళ్ళాలీ అని నిలదీస్తున్నారు. జగన్ పిలిస్తే పిలవ‌వచ్చు, కానీ సినీ రంగానికి చెందిన సమస్యలను చర్చించేందుకు ఆయన ఒక్కడే ఎలా వెళ్తారు అని కూడా లాజిక్ పాయింట్ లాగుతున్నారు. ఈ విషయంలో ఆయన ఇతర పెద్దలను కూడా వెంటబెట్టుకుని వెళ్తే ఇపుడు వస్తున్న విమర్శలకు ఆస్కారం ఉండేది కాదు కదా అని అంటున్నారు.

చిరంజీవి ఒంటరిగా జగన్ ఇంటికి వెళ్ళడం, ఇద్దరూ వన్ టూ వన్ గంట పాటు చర్చలు జరపడం వల్లనే ఇపుడు ఈ రకంగా ఊహాగానాలు వస్తున్నాయని ఆయన తనదైన శైలిలో చెబుతున్నారు. రాజ్యసభ సీటు ఆఫర్ మెగాస్టార్ కి చేశారా లేదా అన్న దాని కంటే అనేక ఊహాగానాలకు అవకాశం ఇచ్చేలా  మెగాస్టార్ ఒక్కడే  వెళ్ళడం ఉందని అంటున్నారు.

మొత్తానికి చిరంజీవి జగన్ మీటింగ్ విషయంలో విపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అంటున్నాయి. అదే టైమ్ లో చిరంజీవి సోలోగా వెళ్ళి ఎలా కలుస్తాయని ఒకే పాయింట్ ని పట్టుకుని కామెంట్స్ చేస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీని చిరంజీవిని కూడా లాగి మరీ రచ్చ చేస్తున్నాయి.

మొత్తానికి సినీ బిడ్డగా ప్రభుత్వంతో చర్చలు జరిపి మంచి చేయాలనుకున్న చిరంజీవిని ఈ గబ్బు రాజకీయం మాత్రం ఏ కోశానా వదలడంలేదు. పైగా ఆయన తప్పు చేసారు అని చెబుతోంది. గతంలో కూడా దాసరి నారాయణరావు లాంటి పెద్దలు నేరుగా ఫోన్ లో సీఎం లతో మాట్లాడేవారు. అలాగే వారు కూడా ఒంటరిగా వెళ్ళి భేటీలు అయిన సందర్భాలు ఉన్నాయి.

మరి ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నా కూడా ఇపుడు చిరంజీవి విషయంలోనే ఇలా ఆరోపణలు రావడం అంటే రాజకీయానికి కాదేదీ అనర్హం అని అంటున్నారు అంతా. ఇంతకీ మెగాస్టార్ సినిమా పరిశ్రమకు  మంచి చేయలనుకుని ఒంటరిగా వెళ్ళి పొరపాటు చేశారా. ఏమో. జనాలే తీర్పు చెప్పాలి మరి.
Tags:    

Similar News