పండుగ చేసుకునే శుభవార్త చెప్పిన ఆర్ బీఐ

Update: 2019-12-16 11:50 GMT
అయితే వడ్డింపులు.. లేదంటే దిమ్మ తిరిగే షాకులు మాత్రమే ఇస్తుందని ఫీలయ్యే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీఐ) తాజాగా ఒక శుభవార్తను చెప్పింది. నగదును ఆన్ లైన్ లో బదిలీ చేసేందుకు నిఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సఫర్) ద్వారా నగదును పంపేందుకు టైంను చూసుకోవాల్సిన అవసరం ఉండేది.

ఎందుకంటే.. బ్యాంకులు పని చేసే రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ మాత్రమే నగదును బదిలీ చేసే వీలు ఉండేది. తాజాగా చేసిన మార్పులతో 365 రోజులూ.. 24 గంటలూ ఏ టైంలో అయినా నగదును ట్రాన్సఫర్ చేసుకునే వీలు ఉంటుంది. దీంతో.. ఆన్ లైన్ పేమెంట్స్ ఏ టైంలో అయినా పంపుకునే వెసులుబాటు కలుగనుంది.

అంతేకాదు.. పండుగ రోజుల్లోనూ.. సెలవు దినాల్లోనూ నగదును బదిలీ చేసుకునే వీలు ఉండనుంది. రిజర్వ్ బ్యాంకు తాజాగా ప్రవేశ పెట్టిన విధానంతో ఎప్పుడు.. ఎవరికైనా ఆన్ లైన్ పేమెంట్లకు వీలు ఉండనుంది. అంతేకాదు.. ఆన్ లైన్ పేమెంట్లు అయిన నెఫ్టె్..ఆర్టీజీఎస్ విధానాల్లో నగదు బదిలీల మీద ఛార్జీలను కూడా ఎత్తివేసిన వైనం తెలిసిందే. మొత్తంగా చూతే,, ఆన్ లైన్ పేమెంట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తాజా నిర్ణయంతో పోయినట్లేనని చెప్పక తప్పదు. ఆన్ లైన్ పేమెంట్లను తరచూ చేసే వారికి తాజా వార్త పండుగ చేసుకునేలా ఉంటుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News