బాబు గారి హయాం.. బాలలపై ఘోరం

Update: 2020-01-18 06:35 GMT
చంద్రబాబు గద్దెనెక్కారు.. వర్షాలు మొహం చాటేశాయి. కరువు, చంద్రబాబు కవల పిల్లలని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అదేంటో కానీ బాబు పాలన కాలంలోనే కరువు కరాళ నృత్యం చేస్తుంటుంది. చంద్రబాబు పాద మహిమో ఏమో..ఆయన పాలనలో కరువే కాదు.. బాలలకు కూడా నరకమే అని తాజా నివేదిక ఒకటి నిగ్గుతేల్చింది.

తాజాగా జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)-2018 సంవత్సరపు నివేదికను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత 2016-18 వరకు 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయని షాకింగ్ వాస్తవం బయటపడింది. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరగడం బాబుగారి పరిపాలన దక్షతకు తార్కాణం అని జాతీయ సంస్థ ఎన్సీఆర్బీ కడిగిపారేసింది.

చంద్రబాబు హయాంలో మైనర్లపై నేరాలకు సంబంధించిన కేసులు 2016లో 1847 నమోదు కాగా..  2018లో ఏకంగా 2672 ఘోరాలు చోటుచేసుకున్నాయి. 52మంది బాలలు హత్యకు  - ఒక బాలిక అత్యాచారానికి గురై హత్యకు గురికాబడిందని తేలింది. ఈ దారుణం తట్టుకోలేక 14మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇలా బాబు హయాంలో వర్షాలే పడకపోవడమే కాదు.. నేరాలు కూడా పెరిగిపోయాయని ఎన్సీఆర్బీ సంచలన నివేదికను బయటపెట్టింది. చంద్రబాబు లా అండ్ ఆర్డర్ దారుణమని ఆక్షేపించింది. బాబు గారి సంస్కరణల వాదిగా పాలన దక్షుడిగా గొప్పలు చెప్పే వారికి ఎన్సీఆర్బీ నివేదిక చెంపపెట్టులా మారింది.


Tags:    

Similar News