మోడీ మాటలేమో కానీ టెలికం కంపెనీలకు చుక్కలేనా?
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా మారింది భారత్ లోని టెలికం కంపెనీల పరిస్థితి. ప్రపంచీకరణ తర్వాత ఎవరికి వారు అన్నట్లు కాక.. ఒకరి మీద ఒకరు ఆధారపడటం ఒక అలవాటుగా మారింది. దీన్నో అవకాశంగా మార్చుకున్న చైనీయులు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు వస్తువుల్ని తయారు చేయటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అన్ని దేశాలు తమ మీద ఆధారపడేలా చేశారు. చైనా దగ్గర నుంచి తెచ్చుకోవటమే కానీ.. తాము కూడా అలా మారటానికి ఉన్న అవకాశాల్ని కల్పించే విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. అదే ఇప్పుడు సమస్యగా మారింది.
ఆధారపడటం అలవాటుగా మారిన వారికి.. అందుకు భిన్నంగా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడీ విషయం మోడీ సర్కారుకు అర్థం కావట్లేదు. కానీ.. కంపెనీలకు మాత్రం బాగా అర్థమవుతున్నాయి. కారణం ఏమైనా కానీ.. చైనాకు చెందిన వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని మాటగా ఆదేశాల్ని జారీ చేయటం చాలా ఈజీ. కానీ.. దాన్ని అమలు చేయటమే కంపెనీలకు ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. ఎక్కడిదాకానో ఎందుకు.. టెలికం కంపెనీలకు ప్రధాని ఒక పెద్ద పిడుగు లాంటి మాటను చెప్పినట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
దాని సారాంశం ఏమంటే.. చైనాకు చెందిన వావై.. జెడ్ టీఈ కంపెనీ ఉత్పత్తుల్ని భారత్ టెలికం కంపనీలు కొనుగోలు చేయకూడదని చెప్పినట్లుగా పేర్కొంది. మోడీ సర్కారు ఆ మాట అనటానికి పెద్దగా ఇబ్బంది పడదేమో కానీ.. టెలికం కంపెనీలకు మాత్రం ఈ మాట పెద్ద షాక్ గా మారతాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఈ రెండు కంపెనీల మీద టెలికం దిగ్గజాలన్ని ఆధారపడతాయన్నది మర్చిపోకూడదు. భారత్ టెలికాం రంగంలో 55 శాతం వాటా ఉన్న ఎయిర్ టెల్.. వొడాఫోన్ రెండుకంపెనీలు చైనాకు చెందిన వావై కంపెనీకి ప్రధాన కస్టమర్లు. ఆ కంపెనీ నుంచి చౌకైన పరికరాల్ని కొనుగోలు చేస్తుంటాయి. 4జీ నెట్ వర్క్ పరికరాల్లో వావై కంపెనీ వాటా ఏకంగా 40 శాతం ఉండటాన్ని మర్చిపోకూడదు.
అంతేనా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సైతం చైనాకు చెందిన జెడ్ టీఈ కంపెనీ మీదే ఆధారపడి ఉంది. ఓవైపు జియో ఎంట్రీతో కిందామీదా పడుతున్న టెలికం కంపెనీలకు.. తాజాగా మోడీ సర్కారు చెప్పిన మాట వారికి కొత్త కష్టాల్ని ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఆ రెండు చైనా కంపెనీల నుంచి పరికరాల్ని కొనుగోలు చేయకుంటే.. వారి మీద పడే భారం భారీగా ఉంటుందంటున్నారు. మరీ.. గండాన్ని టెలికం కంపెనీలు ఇలా అధిగమిస్తాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.