రాహుల్ గాంధీ కి భయపడే మోడీ యూత్ ని తెచ్చాడా ?
రానున్న కాలమంగా యువతదే. యూత్ ఎక్కడ ఉంటే వారిదే అక్కడే సందడి, సక్సెస్ ఉంటాయి. ప్రతీ అయిదేళ్ళకు ఒకసారి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంతో యూత్ పాత్ర చాలా కీలకం. తాజా ఓటుతో వారు ఇచ్చే తీర్పు దేశంలో నూతన ఆవిష్కరణలకే దారి తీస్తుంది. అలా 2014 ఎన్నికల వేళ యూత్ అంతా కలసి పట్టం కట్టిన నేత ప్రధాని మోడీ. నాడు మోడీ ఫీవర్ తో యూత్ ఊగిపోయింది. అప్పటికి రెండు దఫాలుగా కేంద్రంలో యూపీయే ఏలుబడి సాగింది. దాంతో పాటు అవినీతి కుంభకోణాలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో జాతిని ఉద్ధరించే ఘన నేతగా మోడీ యువతకు కనిపించారు. ఆయనకే అంతా జై కొట్టారు. 2019 ఎన్నికల వేళ కూడా దేశభక్తితో ఉర్రూతలూగిన యూత్ బీజేపీని మళ్ళీ పీఎం సీట్లో కూర్చోబెట్టింది. యువతలోఅనేక రకాల భక్తి రగల్చడంలో మోడీ సక్సెస్ అయ్యారు.
మరి 2024 సంగతి ఏంటి అన్నదే అందరికీ కలిగే సందేహం. 2024 ఎన్నికలు మామూలుగా ఉండవని కూడా అంటున్నారు. అంటే 2014లో యూపీయేకు ఎదురైన చేదు అనుభవాలు బీజేపీకి కూడా ఎదురవుతాయా ? అంటే అవును అన్న సమాధానం వస్తోంది. నాడు అవినీతి కుంభకోణాలు ప్రధాన అస్త్రాలు అయితే వచ్చే ఎన్నికల్లో కరోనా మారణ హూమం, ఆర్ధిక సంక్షోభం, ఉపాధికి ఠికాణా లేని నిరుద్యోగ భారతం అన్నీ కలసి యువత పిడికిలి బిగించేలా చేస్తాయని అంటున్నారు. మరి యూత్ ఓటు ఎటువైపు అంటే రాహుల్ ఇపుడు వారికి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. యభై ఏళ్ళు పై దాటినా రాజకీయాల్లో రాహుల్ యూత్ కిందనే లెక్క. పైగా మోడీతో పోలిస్తే రాహులే సరైన ఆల్టర్నేషన్ అన్న భావన కూడా బలపడుతోంది.
దేశంలో 2024 నాటికి 27 శాతానికి పైగా యువ ఓటర్లు ఉంటారు అన్నది అంచనా. దాంతో రాహుల్ కూడా యూత్ మీదనే దృష్టి పెట్టారు. వారినే టార్గెట్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా యువతతో ముచ్చట్లు పెడుతున్నారు. వారితోనే కలసి ముందుకు సాగుతున్నారు. మరి ఏడు పదులు దాటిన మోడీ ఈ విషయంలో బాగా వెనకబడిపోయారు అనే అంటున్నారు. ఆయన క్యాబినెట్ సహచరులు కూడా సీనియర్లు అయిపోయారు. దాంతో యూత్ అట్రాక్షన్ బీజేపీ దగ్గర లేదు అంటున్నారు. ఈ నేపధ్యంలో మోడీ ఒక్కసారిగా తన క్యాబినేట్ కి యూత్ కలర్ ఇచ్చేశారు. యాభై ఏళ్ళ లోపు వారిని కొత్త మంత్రులుగా తీసుకుని యూత్ ని టార్గెట్ చేశారు. తమది యువ ప్రభుత్వమని చాటి చెబుతున్నారు.
ఇది తొలి అడుగు మాత్రమేనని రానున్న రోజుల్లో యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు మోడీ మరిన్ని రాజకీయ విన్యాసాలే చేస్తారు అంటున్నారు. అటు వైపు రాహుల్ ఉన్నారు. చూడడానికి సినిమా హీరోలా ఉంటారు. డెబ్బయ్యేళ్ళ మోడీ ఆయనతో ఢీ కొట్టి యూత్ ఓట్లు రాబట్టగలరా అన్నదే చర్చ. పైగా రెండు సార్లు యువత చాన్స్ ఇచ్చేసిన తరువాత కూడా ఇంకా మోజు పెంచుకోవాలనుకుంటే అయ్యే పనేనా అన్న ప్రశ్న కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ?