మోడీ అన్నంత పని చేసేస్తాడేమో!!
‘‘అన్నంత పని చేసేస్తాడేమో’’ అని అనగానే.. ప్రజల్లో బహుశా కొన్ని ఆశలు చిగురించవచ్చు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం మొత్తం తీసుకువస్తానని, దేశంలోని ప్రతి ఒక్క సామాన్యుడి అకౌంట్ లో 15 లక్షల రూపాయల వంతున డిపాజిట్ చేయిస్తానని మోడీ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘అన్నంత పనీ...’అనగానే ఆ మేరకు తమ ఖాతాల్లో డబ్బు వేసేస్తాడేమో అని జనం అనుకుంటే తప్పులేదు. కానీ.. అదొక్కటీ తప్ప.. ప్రజలకు ఆర్థిక ఇరకాటం కలిగించే విషయాలు తప్ప.. తతిమ్మా సంక్షేమపాలన సాగిస్తున్న మోడీ.. గత ఎన్నికల్లో తాను ప్రకటించిన మరో నినాదాన్ని మాత్రం చేసి చూపిస్తారేమో అనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ.. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అందుకు భారతీయ జనతా పార్టీకి వెన్నంటి నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తోంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనే రాజకీయ ముఖచిత్రం ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తోంది.
ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలుండగా.. కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు కలిపి కేవలం నాలుగు చోట్ల మాత్రమే అధికారంలో ఉన్నాయి. కర్ణాటక - పంజాబ్ - మేఘాలయ - మిజోరం రాష్ట్రాలకు తోడుగా కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ పాలన సాగుతోంది. నిజానికి ఇది చాలా దయనీయ పరిస్థితి కింద లెక్క. ఎందుకంటే.. ఉన్న నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ లో మాత్రమే ఇటీవల విజయం సాధించి గద్దెమీదికి వచ్చారు. మిగిలిన మూడు రాష్ట్రాలకు వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.
వాటిలో కర్నాటకలో ప్రస్తుతం ఉణ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత పనిచేసి.. భాజపా కు అనుకూలం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వాటిని కవర్ చేసిన తర్వాత.. మేఘాలయ - మిజోరం లలో కూడా భాజపా - మోడీ తన మ్యాజిక్ ను ప్రదర్శిస్తే గనుక.. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ఆ సమయానికి 29 రాష్ట్రాల భారతదేశంలో ఒకటిరెండు రాష్ట్రాల్లో మాత్రం తమ అస్తిత్వాన్ని నిలుపుకుని కాంగ్రెస్ నామమాత్రావశిష్టంగా మారిపోవచ్చు. ఇలాంటి అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బీభత్సంగా సాగుతున్నాయి.
2014 ఎన్నికల ప్రచారంలో ఏదో అందమైన నినాదం కోసం మోడీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే పదం వాడారని అనుకున్నాం గానీ.. ఆయన నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకుండా చేసేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది.