లాక్ డౌన్ కంటే..'లాక్ ఓపెన్' అంటే బాగుండేదేమో?
పేరుకే లాక్ డౌన్ కానీ.. మోడీ సార్ మాత్రం రెండో విడత లాక్ డౌన్ లో అన్నింటికి మినహాయింపునిచ్చేశాడు. ఇన్ని మినహాయింపులు చూశాక.. ఇంకెక్కడి లాక్ డౌన్ అని అందరూ ముక్కన వేలేసుకుంటున్నారు. మోడీ అన్ని రంగాలకు , వ్యాపారాలకు ఇచ్చిన వెసులుబాటు చూస్తే ఇదేం లాక్ డౌన్ అని అనకమానరు..
ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ఇప్పటికే 21 రోజుల లాక్ డౌన్ ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడు మే 3 వరకు దాన్ని పొడిగించి మరోమారు కరోనా కట్టడికి తప్పదని మార్గదర్శకాలిచ్చారు. కానీ ఏప్రిల్ 20 నుంచి దేశ ప్రజలకు కాస్త వెసులుబాటు ఇస్తూ తాజాగా బుధవారం జారీ చేసిన మార్గదర్శకాలు చూశాకా.. లాక్ డౌన్ అనడం కంటే ‘లాక్ ఓపెన్’ అని అంటే బాగుంటుందని నిపుణులు సెటైర్ వేస్తున్నారు.
నిజమే.. మరీ మోడీ ఏప్రిల్ 20 నుంచి అన్నింటిని తెరుచుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా జనాలు గుమిగూడే వ్యవహారాలకు మోడీ అనుమతి ఇవ్వడం ముక్కున వేలేసుకునేలా చేసింది.
వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతివ్వడం గమనార్హం.ఇక్కడికి రైతులు పెద్దఎత్తున తరలివస్తారు. దీంతో కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వం తెరవడానికి అవకాశం కల్పించారు. దీంతో ఒక్క కరోనా రోగి వస్తే ఆ గ్రామంలో మటాషే అనడంలో ఎలాంటి సందేహం లేదు. పని ప్రదేశానికి కార్మికుల రవాణా అంశంలో యజమానులు సామాజిక దూరం పాటించాలని సూచించి అనుమతించడం రిస్క్ అయ్యే చాన్స్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. . ఉత్పత్తి యూనిట్లు, వాటి సరఫరా చైన్ సిస్టంకు అనుమతివ్వడంతో వారంతా పనిలోకి వస్తే కరోనా వ్యాపిస్తే ఎవరు కారకులవుతారన్నది ఇప్పుడు ప్రశ్న.
ఇక ప్యాకేజింగ్ మెటీరియల్ యొక్క తయారీ యూనిట్లు.. జూట్ పరిశ్రమలో కార్మికుల షిఫ్టులు, సోషల్ డిస్టన్స్ తో అనుమతిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీల కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఇక్కడ సామూహికంగా చేసే పనితో ఎంతవరకు కరోనాను ఆపగలరనేది ప్రశ్నగా మారింది.
ఇక భవన నిర్మాణాలకు మోడీ జైకొట్టారు. మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిమితుల్లో నిర్మాణ ప్రాజెక్టులలో పనుల కొనసాగింపునకు వలస కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి సామూహికంగా పనిచేస్తారు. కరోనా వ్యాపిస్తే తట్టుకోవడం కష్టం.
ఇక అన్నిటికంటే చెత్త అనుమతి.. రోడ్ సైడ్ దుకాణాలకు అనుమతి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రయాణికులు ఇక్కడ చేరి కరోనాను అంటించడం ఖాయం. వారికి అనుమతి పెద్ద డేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రోడ్ సైడ్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున జనాలు సమూహంగా ఏర్పడుతారు. అది కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.
మొత్తంగా లాక్ డౌన్ రెండో విడతలో మోడీ చాలా వాటికి మినహాయింపునిచ్చాడు. ఇన్ డైరెక్ట్గ్ గా చాలా అనుమతులు ఇచ్చారు. దీంతో కరోనా కట్టడి అంటూ లాక్ డౌన్ పొడిగించడం ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కేవలం కరోనా బారిన ప్రాంతాల్లోనే స్టిక్ట్ గా అమలు చేస్తే సరిపోతుంది కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.