వ్యాలీలో సీఈవోలతో మోడీ ఏం మాట్లాడారు?
తాజాగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై చాలానే అంచనాలున్నాయి. దానికి తగ్గట్లే ఆయన దూసుకెళుతున్నారు. ఓ పక్క అంతర్జాతీయ రాజకీయాలతో పాటు.. మరోవైపు భారత్ దశ.. దిశను మార్చేలా పారిశ్రామిక ప్రముఖులను ఓకే వేదిక మీదకు తీసుకొచ్చి.. తన డిజిటల్ ఇండియా కలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశమైన సందర్భంగా వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే..
= కొత్త ప్రపంచంలో ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రాం.. మన ఇరుగు పొరుగు.
= ప్రజల జీవితాల్ని ఊహించని విధంగా మార్చే అవకాశం డిజిటల్ యుగంలో సాధ్యమవుతుంది.
= అధికారంలోకి వచ్చిన వెంటనే సెల్ ఫోన్లు.. సాంకేతికతతో పేదరికంపై యుద్ధం ప్రకటించాం.
= సీఈవోలతో తాజా సమావేశం కొత్త ఆవిష్కరణలకు తెర తీయనుంది.
= కుటుంబ పెద్ద పాత్ర లేకుండా పిల్లలకు విద్య విషయంలో గూగుల్ ఉపాధ్యాయులు ఆ పాత్ర పోషిస్తున్నారు.
= ప్రజల జీవితాల్ని ఊహించని విధంగా మార్చే సత్తా సోషల్ మీడియాకు ఉంది.
= డిజిటల్ ఇండియా కలకు ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నా.
= పోర్టల్స్.. మొబైల్ యాప్ లతో ప్రజలకు మరింత చేరుగా ఉంటున్నాం.
= ఇంటర్నెట్.. అంతరిక్ష సాంకేతికతతో పాటు.. 170 యాప్ లతో ఉత్తమ పాలనను అందిస్తున్నాం.
= స్మార్ట్ సిటీల ఏర్పాటుకు ఐటీని ఉపయోగించుకుంటాం.
= పారిశ్రామికవేత్తలు.. వృత్తి నిపుణులు అందరూ డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం కావాలి.
= గూగుల్ సహకారంతో 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందిస్తున్నాం.
= సాంకేతికత స్థానిక భాషలో అందరికి అందుబాటులో రావాలి.
= మొబైల్ టెక్నాలజీ రంగ ప్రవేశంతో కొత్త శకం మొదలైంది.
= ప్రపంచంలో చివరి సూర్యాస్తమయానని చూసే సిలికాన్ వ్యాలీలో నిత్యం ఎన్నో కొత్త ఆలోచనలు ఉదయించి మానవాళికి ఉపయోగపడుతున్నాయి.
= సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రజల మధ్య సామాజిక అంతరాలు తగ్గిపోతున్నాయి.
= రానున్న రోజుల్లో ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
= భారత్ లో 125కోట్ల మంది ప్రజలకు డిజిటల్ కనెక్టవిటీ అందివ్వటమే లక్ష్యం.
= గత ఏడాదితోపోలిస్తే.. బ్రాడ్ బ్యాండ్ వినియోగం 63 శాతం పెరిగింది.
= ప్రతి పల్లెలో ప్రతి కుటుంబానికి బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ దగ్గరకు చేస్తాం.
= మొదట కళాశాలలు.. యూనివర్సిటీలు.. హాస్టళ్లు.. అన్ని రహదారులు.. పుణ్యక్షేత్రాలు.. టూరిజం ప్రాంతాలను డిజిటల్ ఇండియా కిందకు తెస్తామని.. అనంతరం పల్లెపై ఫోకస్ పెడతాం.
= ఇప్పటికే 500కు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సిగ్నల్స్ ను ఉచితంగా అందిస్తున్నాం.
= ఎయిర్ పోర్టులలోనే కాదు.. అన్ని రైల్వే స్టేషన్లు.. బస్టాండ్లలో వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తాం.
= ప్రస్తుతం 500కు ఉన్న వైఫై రైల్వే స్టేషన్లను 5వేల సంఖ్యకు పెంచనున్నాం.