ఈ లెక్క తెలిస్తే మోడీ మీద గౌరవం తగ్గుతుంది
సగటు రాజకీయ నేతల మాటలకు భిన్నంగా ప్రధాని మోడీ మాటలు ఉంటాయి. తరచూ స్ఫూర్తివంతమైన ప్రసంగాలు చేసే ఆయన మాటల్ని విన్న వారంతా మోడీ దృష్టికోణం ఎంత విశాలంగా ఉంటుందోనన్న భావన కలుగుతుంది. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం ఉండాలంటూ పెద్ద.. పెద్ద మాటలు చెప్పే మోడీలో రాజకీయ నేత మొత్తంగా మారిపోయాడా? అన్న సందేహాన్ని కలిగించేలా మాట్లాడతారు. అయితే.. మిగిలిన రాజకీయ నేతల మాదిరే మాటలకు చేతలకు మధ్యన వ్యత్యాసం ఎలా ఉంటుందో.. మోడీ విషయంలోనూ అంతే ఉంటుందన్న విషయం తాజా ఉదాహరణ గురించి తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా విపత్తుల బారిన పడే రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిధుల కేటాయింపుల్ని నిశితంగా పరిశీలిస్తే.. మోడీ మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తుంది. తరచూ విపత్తుల బారిన పడే రాష్ట్రాల్ని వదిలేసి.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తూ.. మోడీ సర్కారు తనదైన రీతిలో నిర్ణయం తీసుకుంది.
విపత్తుల బారిన పడే రాష్ట్రాల విషయంలో పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్న విపత్తు ఉపశమన నిధుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారనుంది. తమ హయాంలో రాష్ట్రాలకు పెద్ద పీట వేసినట్లుగా చెప్పే మాటలకు భిన్నంగా తాజాగా కేటాయింపులు జరపటం గమనార్హం. బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన మోడీ సర్కారు..చివరకు తన మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ తుఫాన్లు.. వరదలు.. సునామీలు విరుచుకుపడే రాష్ట్రాల పై శీతకన్ను వేసిన మోడీ సర్కారు.. అందుకు భిన్నంగా బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించటం గమనార్హం.
2015 నుంచి 2020 వరకు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.61,220 కోట్లను కేటాయించగా.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏకంగా రూ.25వేల కోట్లు కేటాయించగా.. తాము అధికారంలో లేని రాష్ట్రాల విషయంలో మాత్రం అరకొర నిధులతో సర్దుబాటు చేసింది. మహారాష్ట్రకు రూ.8915 కోట్లు.. రాజస్థాన్ కు రూ.6094 కోట్లు.. మధ్యప్రదేశ్ కు రూ.4847 కోట్లు.. గుజరాత్ కు రూ.3894 కోట్లు కేటాయించగా.. తరచూ తుపాన్ల బారిన పడే ఆంధ్రప్రదేశ్.. ఒడిశా రాష్ట్రాలకు మాత్రం అరకొర నిధులను మాత్రమే కేటాయించింది. ఒడిశాతో పోలిస్తే ఏపీకి మరీ తక్కువ నిధుల్ని కేటాయించటం గమనార్హం. తరచూ తుపాన్ల బారిన పడే ఏపీకి రూ.2430 కోట్లు.. ఒడిశాకు రూ.4130 కోట్లు కేటాయించిన మోడీ సర్కారు పశ్చిమబెంగాల్ కు రూ.2853 కోట్లు.. తమిళనాడుకు 3751 కోట్లు కేటాయించారు. ఈ రాష్ట్రాల్నిచూసినా అందరి కంటే ఏపీ తక్కువగా ఉండటం గమనార్హం.