టీఆర్ ఎస్ వాళ్లు అలానే ఉంటారు.. మోడీ కీలక వ్యాఖ్య
ఈ రోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మాట్లాడారు. పావు గంట పాటు వారితో మాట్లాడిన మోడీ.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్న ఆయన.. కష్టపడి పని చేయాలన్న సూచన చేవారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పైన ఆరా తీసిన మోడీ.. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రతిస్పందన ఎలా ఉందని అడిగారు. సుప్రీం ఆదేశాలు ఇచ్చి రోజు మాత్రమే అయినందున ప్రజల్లో స్పందన గురించి తెలియటానికి మరికొంత టైం పడుతుందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీతో వ్యాఖ్యానించారు. దీనికి మోడీ తల పంకించినట్లు తెలుస్తోంది.
తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతు ఇవ్వలేదంటూ ఎంపీ సంజయ్ వ్యాఖ్యానించగా.. టీఆర్ఎస్ వాళ్లు అలాగే ఉంటారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేయటం విశేషం.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడిన మోడీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి ప్రధానికి వివరించారు. దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగు అవుతున్నాయని వ్యాఖ్యానించిన మోడీ.. అందుకు ఉదాహరణగా పలు రాస్ట్రాల్ని ఉదాహరణగా ప్రస్తావించటం గమనార్హం. అన్ని రాష్ట్రాల మాదిరి తెలంగాణలో రాజకీయం ఉండదన్న విషయాన్ని మోడీ మరిచిపోతున్నారా?