మ‌హాకూట‌మిని కామెడీ చేసేసిన మోడీ!

Update: 2018-07-04 05:25 GMT
గ్రాఫ్ ప‌డిపోతున్న వేళ సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కుడు ఏం చేస్తారు? త‌న వైరిప‌క్షంపై విమ‌ర్శ‌ల‌కు దిగుతారు. ఘాటు ఆరోప‌ణ‌లు చేస్తారు. తానెంత మొన‌గాడిన‌న్న విష‌యాన్ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే ప్లాన్ ను  ప్ర‌ధాని మోడీ న‌మ్మ‌కున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న మాట‌లు మాత్రం మిగిలిన రాజ‌కీయ నేత‌ల‌కు భిన్నంగా ఉండ‌టం విశేషం.

మోడీని ఓడించ‌ట‌మే ధ్యేయంగా పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తున్న మ‌హాకూట‌మిని లైట్ అన్న‌ట్లుగా తేల్చేశారు మోడీ. ప్ర‌త్య‌ర్థి ఎంత బ‌ల‌మైన వాడన్న‌ది చెప్పిన కొద్దీ.. వారి ధీమా పెరుగుతుంది. దీనికి భిన్నంగా ప్ర‌త్య‌ర్థిని పూచిక పుల్ల మాదిరి తీసేయ‌ట‌మే మోడీ వ్యూహంగా క‌నిపిస్తోంది.

మ‌హాకూట‌మి విష‌యంలో త‌న‌కు ఎలాంటి ఆందోళ‌న లేద‌ని.. అస‌లు కూట‌మి స‌క్సెస్ అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేశారు మోడీ. ఏదో మాట‌వ‌ర‌స‌కు కాకుండా.. కార‌ణాన్ని విశ్లేషించి చెప్ప‌టం గ‌మ‌నార్హం. పొత్తులు కుదుర్చుకోవాలంటే ప్ర‌ధాన పార్టీ ఒక‌టి ఉండాల‌ని.. కానీ.. మ‌హాకూట‌మిలో ప్ర‌ధాన పార్టీ అన్న‌దే లేద‌ని తేల్చారు. కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీతో పోల్చిన ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ప‌క్కా అని చెప్ప‌ట‌మే కాదు అదెలా సాధ్య‌మ‌న్న విష‌యాన్ని ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌తో చెప్ప‌టం గ‌మ‌నార్హం.  

మోడీ మాట‌ల్లోనే అదంతా చెప్పాలంటే.. "మ‌హా కూట‌మి ఏర్పాటుకు.. దాని మ‌నుగ‌డ‌కు అవ‌కాశాలు క‌నిపించ‌ట్లేదు. పొత్తులు కుదుర్చుకోవాలంటే ప్ర‌ధాన పార్టీ ఒక‌టి ఉండాలిగా?  కూట‌మి ఏర్పాటుకు అదే పెద్ద లోపం. మోడీని తొల‌గించాల‌నే ఏకైక ల‌క్ష్యంతోనే మ‌హాకూట‌మి దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

ప్ర‌తిప‌క్షాల‌ను క‌లిపి ఉంచుతున్న‌ది మోడీపై ద్వేషం ఒక్క‌టే. కాంగ్రెస్ త‌న మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తోంది. ప్ర‌తిప‌క్షాల్లోని అంద‌రి దృష్టి అధికారం మీద‌నే. వ్య‌క్తిగ‌త మ‌నుగ‌డ‌.. ప్ర‌ధాని ప‌ద‌వి త‌ప్ప వాళ్ల‌కు మ‌రొక‌టి అక్క‌ర్లేదు. ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్ట‌టానికి రాహుల్ సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా కూడా ప్ర‌ధాని ప‌ద‌విపై క‌న్నేశారు. కానీ.. ఆమెకు వామ‌ప‌క్షాల‌కు ప‌డ‌దు. ప్ర‌ధాని ప‌ద‌వి త‌మ అధినేత త‌ప్ప అర్హుడు లేడ‌ని స‌మాజ్ వాదీ అంటుంది. కాంగ్రెస్ అహంకారాన్ని ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో తిర‌స్క‌రించారు. పొత్తుల కోసం ఎక్కే గ‌డ‌ప దిగే గ‌డ‌ప అన్న‌ట్లు ఆ పార్టీ ప‌రిస్థితి ఉంది. ఇప్పుడా పార్టీ ప్రాంతీయ పార్టీలా మారింది" అని చెప్పుకొచ్చారు.

ఓవైపు విప‌క్షాల్ని సునిశితంగా విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు త‌మ కూట‌మి ఎంత బ‌ల‌మైన‌దో చెప్పే ప్ర‌య‌త్నం చేసుకున్నారు. ఎన్డీయేలో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని.. భాగ‌స్వామ్యులు అసంతృప్తితో ఉన్నట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం త‌ప్ప‌న్నారు. న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నంగా ఎన్డీయేను అభివ‌ర్ణించిన మోడీ.. 20 పార్టీల‌తో త‌మ‌ది అతి పెద్ద సంతోష కుటుంబంగా చెప్పుకోవ‌టం విశేషం. ఇలా.. మెత్త‌గా మాట‌లు చెబుతున్న మోడీ తీరు చూస్తే.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ దేశ ప్ర‌జ‌ల్ని కూడా త‌న‌కు త‌గ్గ‌ట్లు ట్యూన్ చేసుకుంటారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.
Tags:    

Similar News