టుడే సర్వే: బెస్ట్ పీఎం - బెస్ట్ సీఎంలు వీరే!
ప్రధాని మోడీకి ఉన్న ప్రజాధరణ, ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఇంకా ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు మరోసారి ఎన్నికలు జరిగినా కూడా మోడీయే పీఎం అవుతారని, ఎక్కువమంది మోడీకే ఓటు వేస్తారని తేలింది. ఈ విషయంలో అత్యంత ప్రజాదరణ పొందిన పీఎంగా కూడా ఇందిరాగాంధీ తర్వాత మోడీయే అని చెబుతుంది తాజా సర్వే.
19 రాష్ట్రాల్లోని సుమారు 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తాజాగా ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రజాధరణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని, ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే అయ్యే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. ఓటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరనే విషయమై నిర్వహించిన ఈ సర్వేలే.. బెస్ట్ ప్రధానమంత్రులు - బెస్ట్ ముఖ్యమంత్రులపై కూడా వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్డీయేకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని తేలింది. ఈ సందర్భంలో ప్రధాని పదవి విషయంలో మోడీకి అనుకూలంగా 50 శాతం మంది ప్రజలు మద్దతు తెలపగా.. రాహుల్ గాంధీకి కేవలం 13శాతం దక్కి రెండోస్థానానికి పరిమితం కాగా ఆ తర్వాతి స్థానాల్లో సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. తాజాగా ఎన్డీయే సర్కార్ పై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఆరోపణలు వంటి అంశాలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయానని ఈ సర్వే పేర్కొంది. లోకసభ ఎన్నికలు జరిగితే ఏకంగా 304 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆ సర్వే తెలిపింది.
బెస్ట్ పీఎం, బెస్ట్ సీఎం లపై కూడా ఈ సర్వే వివరాలు వెల్లడించింది. బెస్ట్ ప్రధానమంత్రుల్లో మొదటి స్థానంలో ఇందిరాగాంధీ నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వాజపేయి, నరేంద్ర మోడీలు నిలిచారు. ఇక అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మొదటిస్థానంలో నిలవగా, తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. బీజేపీ కి ఫుల్ ఎనర్జీ ఇచ్చేలా ఉన్న ఈ సర్వేని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరిట కార్వీ ఇన్ సైట్స్ భాగస్వామ్యంతో ఇండియా టుడే నిర్వహించింది.