సైన్యంతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి ... చైనా - పాక్ కి తీవ్ర హెచ్చరికలు : మోడీ
సైనికుల తో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రధాని మోదీ రాజస్తాన్‌లోని జైసల్మీర్‌కు చేరుకున్నారు. అక్కడి లొంగ్వాలాలో జరగనున్న ఈ వేడుకల్లో బిఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే మోదీతో పాటు ఉన్నారు. వీరమరణం పొందిన జవాన్లను నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ తెలిపారు.
చైనా, పాకిస్థాన్ లతో నెలకొన్న ఉద్రక్తతల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ఆ రెండు దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల వద్ద మనల్ని ఎవరైనా పరీక్షించాలని చూస్తే, దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారత్ కు పలు దేశాలతో పొడమైన సరిహద్దులు ఉన్నాయని, అయితే, ప్రతి భారతీయుడికి తెలిసిన పోస్ట్ లాంగేవాలా అని మోదీ అన్నారు. జవాన్ల పరాక్రమం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి లాంగేవాలా యుద్ధం గుర్తొస్తుందని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయులను కాపాడుకోవడానికి దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లు అండగా ఉన్నారని అన్నారు. మీతో ఎంత ఎక్కువ సమయం గడిపితే... అంత ఎక్కువగా దేశానికి సేవ చేయాలనే తపన, ఆకాంక్ష బలపడుతుందని చెప్పారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.