టీడీపీకి మరో పగటి వేషగాడు దొరికాడు..
ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులు రాజకీయ కార్యకలాపాలపై శ్రద్ధ పెట్టారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఉండడంతో కాలు మీద కాలేసుకుని పనులు చేయించుకున్నారు. ప్రస్తుతం వారు ప్రతిపక్షంలోకి వెళ్లడంతో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మళ్లీ ఉనికిని చాటుకునేందుకు ప్రజల్లోకి బయల్దేరారు. పార్టీ అధినేత ప్రజా చైతన్య యాత్ర అని అకస్మాత్తుగా ప్రకటించి రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లగా చుక్కదురైంది. సొంత నియోజకవర్గంలో కుప్పంలో వ్యతిరేక రాగా విశాఖపట్టణంలోనూ వ్యతిరేకత వచ్చింది. దీంతో దాన్ని వాళ్లు తమకు సానుకూల అంశంగా మార్చుకుని హైలెట్ అయ్యారు. ఈ హైలెట్ అనే పదం అంటే టీడీపీ నాయకులకు ఎంతో ఇష్టం. మీడియాలో పడాలనే ఉత్సాహం ఘాటు వ్యాఖ్యలతో వివిధ రకాల వేషాలు వేస్తుంటారు. గతంలో ఎన్నో వేషాలు వేసిన వారు ఉండగా తాజాగా వారికి మరో వ్యక్తి దొరికాడు.
గతంలో కర్నూలు మేయర్ గా పనిచేసిన బండి అనంతయ్య చిత్ర విచిత్ర వేషాలు జనాన్ని ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు సైలెంటయ్యాడు. ఈయన మాదిరినే ఎంపీగా ఉన్న సమయంలో నటుడు ఎన్.శివప్రసాద్ ఎన్నో రకాల వేషాలు వేశారు. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో అందరి చూపు తనపై పడాలనే ఆశతో వివిధ రకాల వేషధారణలు వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మాదిరి మరో శిష్యుడు లభించాడు. అయితే ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోనే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై కడప జిల్లా రైల్వేకోడూరు కు చెందిన తెలుగుదేశం నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ ఓ వేషం వేశాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అని దాని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే అంశంతో పిచ్చి తుగ్లక్ వేషం కట్టాడు. జగన్ ను ఎద్దేవా చేస్తూ డైలాగులు వేస్తూ ప్రజల్లో తిరిగాడు. తుగ్లక్ వేషంలో రైల్వేకోడూరు వీధుల్లో, బజార్లలో తిరుగుతూ అవగాహన కల్పించాడు. దుకాణ దారులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ.. కాసేపు కామెడీ చేశాడు. ఈ పిచ్చి నిరసనల తుగ్లక్ వేషాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ తనదైన శైలిలో ఆందోళన చేపట్టాడు.