పుట్టగానే పరిమళించిన లోకేష్ పువ్వు..!!
అవును నిజం. కొందరంతే పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా కనిపిస్తారు. అలాంటి వారినే మన పెద్దలు కారణజన్ములు అంటారు. ఆ కోవలోకి వచ్చిన వారే ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్. ఈయన తెలివి తేటలకు జన్మనిచ్చిన వారు మురిసి ముక్కలవ్వడమే కాదు.... ఆ తెలివి తేటలను రెండు దశాబ్దాల తర్వాత బయటపెట్టారు. లోకేష్ బాబు మంత్రి కావడానికి ముందు.... మంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రసంగాలకు... జయంతులను... వర్ధంతులుగా... వర్ధంతులను... జయంతులుగా చేసిన వైఖరికి ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజలే కాదు.... ప్రపంచంలోని తెలుగు వారంతా మురిసి ముక్కలయ్యారు. చిన్న బాబు తెలివి తేటలు ఇంతేనా.. అంటే ఇంకా చాలానే ఉన్నాయి. అమెరికా వెళ్లిన లోకేష్ బాబు అక్కడ తెలుగుదేశం నాయకులతో జరిగిన సమావేశంలో "మీ ఉత్సాహం చూస్తావుంటే... ఇక్కడ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చింది" అన్నారు నారా వారబ్బాయి. ఇలా తన తెలివి తేటలు... వాక్చాతుర్యం ప్రదర్శించేందుకు ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోలేదు. మరోసారి మనం దేశం నుంచి విడిపోయిన తర్వాత అని కూడా ఆయన విలపించారు. తెలివి తేటలు ఎక్కువైపోయన వారు మాత్రమే ఇలా మాట్లాడతారని తెలుగు ప్రజలు... ముఖ్యంగా నెటిజన్లు వాపోయారు.
సరే, ఇంతకీ అసలు విషయం ఏమిటనుకుంటున్నారా... నారా లోకేష్ బాబుకి ఈ తెలివి తేటలు....అద్భుత ప్రసంగాలు ఇప్పుడు అబ్బినవి కావు. జాతీయ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నప్పుడే లోకేష్ బాబు అనే పువ్వు వికసించిందట. ఆ సుమాల పరిమళాన్ని చంద్రబాబునాయుడు తాజాగా రాష్ట్ర ప్రజలందరికి పంచారు. జాతీయ స్ధాయిలో ఓ కూటమి ఏర్పడి, దానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించిన 1996 సంవత్సరం గుర్తుంది కదా... ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఎవరిని చేయాలని కలగూర గంప పార్టీలన్నీ తలమునకలయ్యాయట. ఆ సమయంలో చంద్రబాబు నాయుడినే ఆ బాధ్యతలు తీసుకోవాలని చాలా మంది నాయకులు ఒత్తిడి తెచ్చారట. దాంతో ఏం చేయాలా అని చంద్రబాబు నాయుడు మహా ఆలోచనలో పడిపోయారట. ఆ సమయంలో ఆయనకి దేశమా... ? రాష్ట్రమా...? అనే సందిగ్దం కూడా వచ్చింది. అలా తల పట్టుకున్న చంద్రబాబు దగ్గరికి ఆయన తనయుడు నారా లోకేష్
వెళ్లి " నాన్నా... నీకు రాష్ట్ర ప్రజలే ముఖ్యం. వారి తర్వాతే... నేను.. అమ్మా. నువ్వు ఇక్కడే ఉండాలి" అని అతి గొప్ప సలహా ఇచ్చారట. దీంతో చంద్రబాబు నాయుడు "లోకేష్ బాబూ ఎంత ఎదిగిపోయావయ్యా" అని అక్కున చేర్చుకుని రెండు ఆనంద బాష్పాలు కూడా రాల్చి ప్రధాని పదవిని త్యాగం చేశారట. పాత సినిమాలో రమాప్రభా.... రాజబాబు పాట చివరిలో అన్నట్లుగా " అప్పుడు నా వయసైద్యయ్యా... వచ్చింది మా తాతయ్య. సేమ్ టు సేమ్ అప్పుడు రమాప్రభా... ఇప్పుడు నారా లోకేష్. కాకపోతే రమాప్రభకు ఐదేళ్లు... లోకేష్ 13 ఏళ్లు. మిగిలిందంతా సేమ్ టు సేమ్. దీనినే మన పెద్దలు పువ్వు పుట్టగానే పరిమళించడం అంటారు.