ఇంటింటికీ కూటమి.. ఇలా చేయండి.. సీనియర్ల డైరెక్షన్ ..!
తద్వారా ఇక్కడ వచ్చే ప్రజల ఫీడ్ బ్యాక్‌ను అంచనా వేసుకుని.. తర్వాత గ్రామాలు, మారుమూల ప్రాంతా లకు వెళ్లాలని నిర్ణయించారు.
`ఇంటింటికీ కూటమి ప్రభుత్వం` పేరుతో సోమవారం నుంచి ప్రారంభించిన కార్యక్రమం తొలిరోజే చప్పగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా నాయకులు పెద్దగా ముందుకు సాగలేదు. దీనిని సమీక్షించిన సీనియర్లు.. సా యంత్రానికి కీలక ప్రతిపాదనలతో కొన్ని సూచనలు చేశారు. వీటిని చంద్రబాబుకు కూడా అందించారు. ఈ సూచనలు పాటిస్తే.. కార్యక్రమం హిట్ అవుతుందన్నది సీనియర్ల ఆలోచన. ప్రస్తుతం మై టీడీపీ యాప్‌లో కేవలం 12 నియోజకవర్గాల సమాచారం మాత్రమే అప్‌లో డ్ అయింది.
అంటే.. ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నాయకులు పెద్దగా పట్టించుకోలేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లు సూచనల మేరకు.. నాయకులు.. ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించాలనిపేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలను వదిలేసి.. నగరాలు, పట్టణాల్లో ప్రజలను కలుసుకోవాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి కార్యక్రమంలో తొలి 20 రోజులు నగరాలకు, పట్టణాలకు పరిమితం కావాలని భావిస్తున్నారు.
తద్వారా ఇక్కడ వచ్చే ప్రజల ఫీడ్ బ్యాక్‌ను అంచనా వేసుకుని.. తర్వాత గ్రామాలు, మారుమూల ప్రాంతా లకు వెళ్లాలని నిర్ణయించారు. ఇదేసమయంలో ప్రజల నుంచివచ్చే సమస్యలు.. వారి డిమాండ్లను నమోదు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న నిబంధనతో కార్యక్రమం ముందుకు సాగడం లేదని గుర్తించిన సీనియర్లు.. కలెక్టర్ల పాత్రను పక్కన పెట్టాలని సూచించారు.
అధికారులు లేకుండా క్షేత్రస్థాయి వార్డు సభ్యులు, బూత్ లెవిల్ కేడర్‌తో ఎమ్మెల్యేలు ప్రజలను కలుసుకు నేందుకు అవకాశం కల్పించారు. సమస్యలు తెలుసుకున్నాక.. మైటీడీపీ యాప్‌లో నిక్షిప్తం చేయడం అనేది నిబంధనే అయినా.. దీనిని రెండు రోజుల వరకు అవకాశం కల్పించారు. ఎప్పటికప్పుడు కాకుండా.. రెండు రోజుల తర్వాత అయినా.. మై టీడీపీ యాప్‌లో నమోదు చేయాలన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లే నిబంధనలోనూ కొన్ని మార్పులు చేశారు. అందుబాటులో ఉన్నవారిని తీసుకుని ప్రజలను కలుసుకోవాలని పేర్కొన్నారు.