లోకేష్ సవాల్ కు జగన్ ప్రభుత్వ సమాధానమదే?

Update: 2019-06-27 17:55 GMT
తమపై అవినీతి ఆరోపణలు చేయడం కాదు.. నిరూపించాలని అంటున్నారు నారా లోకేష్. ఎమ్మెల్యేగా ఓడిపోయిన షాక్ నుంచి నారా లోకేష్ బయటపడినట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడికి ఎమ్మెల్యేగా ఓడిపోవడం అంటే అంతకు మించిన అవమానం లేదు. అయితే లోకేష్ మాత్రం దాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా లేరు. అప్పుడే లోకేష్ సవాళ్లు - చాలెంజ్ విసురుతూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడి పాలన ఏ పాటితో ప్రజలు ఎన్నికల తీర్పులోనే చాటారు. ఇంకా లోకేష్ సవాళ్లు చేయడం ఎందుకో.. అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ ప్రభుత్వం సమాధానం రెడీ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

లోకేష్ నిర్వహించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల అవినీతి గురించి క్షుణ్ణంగా పరిశీలనలు సాగుతూ ఉన్నాయని సమాచారం. ప్రత్యేకించి భూముల కేటాయింపు, అంచనాల పెంపు.. ఈ రెండు అంశాల గురించినే కసరత్తు సాగుతూ ఉందని సమాచారాం.

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపుల అంశం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆ వ్యవహారంలో కోరిన దానికన్నా ఎక్కువ భూమినే అడ్డగోలుగా కేటాయించారని సమాచారం. దాంతో పాటు విశాకలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో అతి భారీగా ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఖర్చు భారీగా పెట్టినా అందుకు సంబంధించిన ఫలితాలు అక్కడేమీ లేవని.. అదంతా పెద్ద స్కామ్ అనే ఆరోపణలున్నాయి.

ఈ అంశాలన్నింటి మీదా జగన్ ప్రభుత్వం పాత ఫైళ్ల దుమ్ముదులిపితే లోకేష్ బుక్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి స్కామ్ లు బయటకు వస్తే.. అదంతా కుట్ర అంటూ నారా లోకేష్ ఎదురుదాడి చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News