నేను ఇంకా పోలేదు బ్రతికే ఉన్నా ...బ్రతికుండగానే మరణ జాబితాలో పేరు !
ప్రస్తుత రోజుల్లో మరణించిన తరువాత కూడా డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. కానీ , బ్రతికుండానే ఓ వ్యక్తి పేరు మరణ జాబితాలోకి ఎక్కేసింది. అదేంటి చనిపోయిన వారిని పక్కన పెట్టి ఈ మధ్య బ్రతికున్న వారిని మరణ జాబితాలో ఎక్కిస్తున్నారా? అని అనుకుంటున్నారా ..అలాంటిదేమి లేదు ..అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రతికున్న వ్యక్తి పేరు మరణ జాబితాలోకి ఎక్కేసింది. ఇది తెలుసుకున్న సదురు వ్యక్తి నేను ఇంకా చావలేదు మొర్రో ..బ్రతికే ఉన్నా అంటూ అధికారులకి విన్నపించుకున్న ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తీ వివరాల్లోకి వెళ్తే ..బేస్తవారిపేట మండలం లోని కొత్త పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రవి..తనకు ఉపాధి పని కల్పించాలని ఎన్ ఆర్ ఐ జి ఎస్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. తన పేరును పరిశీలించాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అతడి వివరాలను పరిశీలించి...ఈ పేరు మరణ జాబితాలో ఉందని సిబ్బంది తెలపడంతో బాధితుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను.. అప్పుడే మరణ జాబితాలో పేరు ఎలా వచ్చిందని అధికారులను నిలదీశాడు. దీనితో తప్పు జరిగిందని భావించిన అధికారులు ..మరణ జాబితాలో నుంచి పేరును తీసివేసి త్వరలో ఉపాధి కల్పిస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు.