నాగబాబు దూకుడు.. చినబాబుతో చెడుగుడు

Update: 2019-02-05 13:27 GMT
పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సొంత యూట్యూబ్ చానల్ ఒకటి మొదలుపెట్టిన తరువాత వరుస లైవ్‌ లు, వీడియోలతో హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కొద్దికాలంగా బాలకృష్ణతో మొదలుపెట్టి ఆ తరువాత చంద్రబాబు, ఇప్పుడు లోకేశ్‌ లను టార్గెట్ చేసుకున్నారు. మధ్యమధ్యలో అప్పుడప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా విమర్శలు చేస్తున్నారు.
   
తన సోదరుడు పవన్ కల్యాణ్, ఆయన పార్టీ జనసేలకు మద్దతుగా రంగంలోకి దిగిన పవన్ ఒక వ్యూహం ప్రకారం సోషల్ మీడియా ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్, ఏబీఎన్ చానల్లను టార్గెట్ చేశారు. దావోస్ సదస్సులో లోకేశ్ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారంటూ ఏబీఎన్ ప్రసారం చేసిన వార్తను పట్టుకుని దానిపై సెటైర్లు కురిపించారు. ఆ సంస్థల పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు... మోదీని కూడా నాగబాబు వెనకేసుకొచ్చారు. ఏపీకి వచ్చే పెట్టుబడులను గుజరాత్ కు మళ్లిస్తున్నారన్న ఏబీఎన్ కథనంపై స్పందిస్తూ మోదీకి ఇంకేమీ పనుండదని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
   
నాగబాబు వీడియోపై మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నా టీడీపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నాగబాబు వెటకారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.


Full View
Tags:    

Similar News