ఈసారి భార‌త క‌రెన్సీ నోట్ల‌పై..నాగ‌బాబు మ‌రో సంచ‌ల‌న ట్వీట్!

Update: 2020-05-23 08:50 GMT
మహాత్మాగాంధీని హ‌త్య‌చేసిన నాథూరాం గాడ్సేపై జనసేన పార్టీ నాయకుడు, సినీ నటుడు నాగబాబు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దానిపై తీవ్ర దుమారం రేపి.. విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. తాజాగా అత‌డు మరో సంచ‌ల‌న ట్వీట్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తెలా కొన్ని డిమాండ్ చేశారు. ఈసారి కరెన్సీ నోట్లపై స్పందించారు.

``భార‌త‌ కరెన్సీ నోట్ల మీద సుభాశ్‌ చంద్రబోస్, అంబేడ్క‌ర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయ్‌లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ`` అని నాగ‌బాబు ట్వీట్ చేశారు. దీనికి అనుస‌రించి మ‌రో ట్వీట్ చేశారు.

``గాంధీ గారు బ‌తికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప ముఖాలు గుర్తురావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది`` అని ట్విట‌ర్ ద్వారా కోరారు.

నాగ‌బాబు చేసిన ట్వీట్ కొంత స‌మంజ‌మైన‌దే. అందుకే పెద్ద‌గా విమ‌ర్శించ‌డానికి అవ‌కాశం లేదు. కొంద‌రిని ఇరుకున పెట్టేలా నాగ‌బాబు ట్వీట్ ఉంది. దీనిపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటే.. మ‌రికొంద‌రేమో అది వాస్త‌వ‌మే క‌దా అని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News