బిగ్ బ్రేకింగ్: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు ఎప్పుడంటే?

Update: 2022-10-03 07:23 GMT
తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగే ముచ్చటను ఎన్నికల కమిషన్ చెప్పింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల కానుంది.

ఈనెల 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది 17. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నవంబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తారు.

కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాల్వాయి గోవర్ధన్ కుమార్తె 'స్రవంతి'ని బరిలోకి దింపింది. ఈ పోటీలో అధికారికంగా ఈమెనే పోటీచేయనుంది. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేయనున్నారు. ఇక టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా త్వరలోనే టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించడం ఖాయమంటున్నారు.

మునుగోడు తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలు. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్ లో రెండు నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News