ఆకాశంలో అద్భుతం... జులై 13 న భూమికి దగ్గరగా మార్స్, వీనస్, మూన్ !

Update: 2021-07-12 04:54 GMT
ఆకాశంలో కొన్ని కొన్ని సమయాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ మద్యే  ఇంద్రధనస్సు సూర్యుడిని చుట్టేయగా చూపరులను అది ఎంతగానే ఆకట్టుకుంది. హెలీ తోక చుక్క మనకు డెబ్బై ఆరు సంవత్సరాలకు కనపడుతుంది. దీన్ని బట్టి చూస్తే ..  మనిషి సగటు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇలా ఖగోళంలో కొన్ని సందర్బాల్లో వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిని వీక్షించితే చెప్పలేని అనుభూతి. తాజాగా జూలై 12, 13 తేదీల్లో భమికి పక్కనే ఉన్న అంగారక, శక్ర గ్రహాలు అతి చేరువగా రానున్నాయి. అంత కాకుండా ఈ గ్రాహాలతో పాటు చందమామ కూడా దగ్గరగా కనిపించనుంది.

ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో అవి భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారక, శుక్రుల మధ్య ఎడం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చందమామ.. పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం 8వ తేదీ నుంచే కనపడుతుంది. 13న మరింత దగ్గరగా కనిపిస్తాయి. వీటిలో రెండు గ్రహాలను ఎటువంటి టెలిస్కోపులు, బైనాక్యులర్ ల అవసరం లేకుండానే వీక్షించవచ్చని,   దేశంలో ఎక్కడి నుంచైనా వీటిని వీక్షించవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలిపింది. జులై 13 తర్వాత అవి క్రమంగా దూరం అవుతాయని భావిస్తున్నారు. 
Tags:    

Similar News